Stuart Broad: అద్భుత విన్యాసం.. వికెట్లే కాదు క్యాచ్‌లు కూడా బాగా పట్టగలడు

England Stuart Broad Pulls-off One-Handed Catch Dismiss Kagiso Rabada - Sakshi

ఇంగ్లండ్‌ సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అద్భుత విన్యాసంతో మెరిశాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్రాడ్‌ ఈ విన్యాసం చేశాడు. విషయంలోకి వెళితే..  సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబడా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మాథ్యూ పాట్‌ బౌలింగ్‌లో రబడా మిడ్‌ఫీల్డ్‌ దిశగా బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడుంది ఎవరు.. ఆరు అడుగులు ఆరు అంగుళాల స్టువర్ట్‌ బ్రాడ్‌. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన బ్రాడ్‌ ఒకవైపుగా డైవ్‌చేస్తూ ఒంటిచేత్తో ఎవరు ఊహించని విధంగా స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

తన మెరుపు విన్యాసంతో జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్టును కూడా నోరెళ్లబెట్టేలా చేశాడు. బ్రాడ్‌ విన్యాసం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే టెస్టులో బ్రాడ్‌.. ప్రొటిస్‌ బ్యాటర్‌ వెరిన్నేను ఔట్‌ చేయడం ద్వారా లార్డ్స్‌ వేదికలో 100వ వికెట్‌ సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఒకే వేదికపై వంద వికెట్లు సాధించిన ఇంగ్లండ్‌ రెండో బౌలర్‌గా.. ఓవరాల్‌గా నాలుగో బౌలర్‌గా ఘనత సాధించాడు.

బ్రాడ్‌ ఇంత మంచి ఫీట్‌ అందుకున్నా ఇంగ్లండ్‌ మాత్రం తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైంది. ఏకంగా ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో దక్షిణాఫ్రికా ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 289/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ప్రోటీస్‌కు 161 పరుగల లీడ్‌ లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో  సారెల్‌ ఎర్వీ (73) అర్ధ సెంచరీ చేయగా, ఎల్గర్‌ (47), కేశవ్‌ మహరాజ్‌ (41) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 149 పరుగులకే  ఆలౌట్‌ అయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

చదవండి: Asia Cup 2022: కెప్టెన్‌గా షనక.. ఆసియాకప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక

ఇంగ్లండ్‌ జట్టుకు ఘోర పరాభవం.. 19 ఏళ్ల తర్వాత తొలి సారిగా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top