ఇంగ్లండ్, డెన్మార్క్‌ మ్యాచ్‌ ‘డ్రా’ | England and Denmark match draw | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్, డెన్మార్క్‌ మ్యాచ్‌ ‘డ్రా’

Jun 21 2024 4:02 AM | Updated on Jun 21 2024 2:05 PM

England and Denmark match draw

ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ): యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో గత రన్నరప్‌ ఇంగ్లండ్‌ జట్టు ఖాతాలో తొలి ‘డ్రా’ చేరింది. డెన్మార్క్‌తో గురువారం జరిగిన గ్రూప్‌ ‘సి’ లీగ్‌ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. 

ఇంగ్లండ్‌ తరఫున ఆట 18వ నిమిషంలో హ్యారీ కేన్‌ గోల్‌ చేయగా... 34వ నిమిషంలో హిజుల్‌మండ్‌ గోల్‌తో డెన్మార్క్‌ జట్టు స్కోరును సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్‌ చేయలేకపోయాయి. గ్రూప్‌ ‘ఎ’లో స్కాట్లాండ్, స్విట్జర్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 1–1తో... గ్రూప్‌ ‘సి’లో స్లొవేనియా, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా 1–1తో ‘డ్రా’గా ముగిశాయి.   

Advertisement
 
Advertisement
Advertisement