ENG VS IND 4th Test Day 1: నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు | ENG VS IND 4th Test: India 78 For No Loss At Day Lunch | Sakshi
Sakshi News home page

ENG VS IND 4th Test Day 1: నిలకడగా ఆడుతున్న భారత ఓపెనర్లు

Jul 23 2025 5:57 PM | Updated on Jul 23 2025 7:31 PM

ENG VS IND 4th Test: India 78 For No Loss At Day Lunch

భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య మాంచెస్టర్‌ వేదికగా ఇవాళ (జులై 23) నాలుగో టెస్ట్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి నిలకడగా ఆడుతుంది. లంచ్‌ విరామం సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 40, యశస్వి జైస్వాల్‌ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

తొలి సెషన్‌ అంతా కష్టపడినా ఇంగ్లండ్‌ బౌలర్లకు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. లంచ్‌ సమయానికి బెన్‌ స్టోక్స్‌ వారి స్పిన్‌ అస్త్రం లియామ్‌ డాసన్‌ను బరిలోకి దించలేదు. పేసర్లు క్రిస్‌ వోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ తలో 8 ఓవర్లు బౌలింగ్‌ చేశారు. స్టోక్స్‌, బ్రైడన్‌ కార్స్‌ తలో 5 ఓవర్లు వేశారు. 

బౌలర్లను ఎంత మార్చినా స్టోక్స్‌కు ఎలాంటి ఫలితం రాలేదు. రాహుల్‌, జైస్వాల్‌ ఎంతో పట్టుదలతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. నిదానంగా ఆడుతున్నా, చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. 

కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. మొదటి, మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా.. భారత్‌ రెండో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌లో నిలబడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌ భారత్‌కు డు ఆర్‌ డైగా మారింది.

తుది జట్లు..
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, ⁠ ⁠బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, ⁠హ్యారీ బ్రూక్,⁠ బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్-కీపర్), లియామ్ డాసన్, ⁠క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే,  జోఫ్రా ఆర్చర్.

భారత్‌: యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్‌, శుభమన్ గిల్, రిషబ్ పంత్ (WK),రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్‌ ఠాకూర్‌, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

 

Advertisement
 
Advertisement
Advertisement