భారత్‌తో చారిత్రాత్మక టెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన | ECB announces Englands squad for historic Women's Test match at Lords against India | Sakshi
Sakshi News home page

భారత్‌తో చారిత్రాత్మక టెస్ట్‌కు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన

Jun 18 2026 5:53 PM | Updated on Jun 18 2026 7:02 PM

ECB announces Englands squad for historic Women's Test match at Lords against India

భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టుతో జ‌ర‌గ‌నున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 15 మంది స‌భ్యులతో కూడిన త‌మ జ‌ట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్ర‌కటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా నాట్ స్లివర్-బ్రంట్ కెప్టెన్‌గా వ్యహరించనుంది.

అదేవిధంగా అలిస్ క్యాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, మాడీ విలియర్స్, గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్డ్‌లకు తొలిసారి ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో చోటు దక్కింది.  వీరిలో గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్డ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఏ ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేయలేదు.

142 ఏళ్లలో ఇదే తొలిసారి
కాగా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుండి 13 వరకు లార్డ్స్ మైదానం వేదికగా జరగనుంది. అయితే లార్డ్స్‌ తన 142 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. అంతకంటే ముందు ఇదే మైదానంలో జూలై 5న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. 

ఈ చారిత్రత్మక టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ తమ జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశముంది. భారత్‌, ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్స్ చివరగా 2023లో రెడ్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి.

భారత్‌తో ఏకైక టెస్టు కోసం ఇంగ్లాండ్ మహిళల జట్టు
నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మాయా బౌచర్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, గ్రేస్ పాట్స్, ఎల్లీ థ్రెల్‌కెల్డ్, మాడీ విల్లయర్స్, ఇస్సీ వాంగ్.
చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement