బాలీవుడ్‌ పాటకు స్టెప్పులేసిన డ్వేన్‌ బ్రావో.. స్పందించిన అక్షయ్‌ కుమార్‌, వార్నర్‌ | Dwayne Bravo dances to Bachchan Pandey title song | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ పాటకు స్టెప్పులేసిన డ్వేన్‌ బ్రావో.. స్పందించిన అక్షయ్‌ కుమార్‌, వార్నర్‌

Mar 2 2022 9:52 AM | Updated on Mar 2 2022 10:50 AM

Dwayne Bravo dances to Bachchan Pandey title song - Sakshi

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో తన డ్యాన్స్‌తో అభిమానులను మరో సారి అలరించాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బచ్చన్ పాండే' టైటిల్‌ సాంగ్‌కు బ్రావో స్టెప్పులు వేశాడు. బ్రావో తన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. "అక్షయ్‌కుమార్‌తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్న ఛాంపియన్" అని బ్రావో ఈ వీడియెకు క్యాప్షన్‌గా పెట్టాడు. ప్రస్తుతం బ్రావో డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా బ్రావో డ్యాన్స్‌పై  అక్షయ్ కుమార్ స్పందించాడు.

తను నటించిన సినిమాలో పాటకు వెస్టిండీస్ క్రికెటర్ డ్యాన్స్‌ చేయడం చాలా సరదాగా అనిపించందని అక్షయ్ కుమార్ తెలిపాడు,. బ్రావో డ్యాన్స్‌ బాగా చేశాడని అక్షయ్ కుమార్ ప్రశంసించాడు. ఇక ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ కూడా  బ్రావో డ్యాన్స్‌పై స్పందించాడు. :"హహ బ్రావో డ్యాన్స్‌ అద్భుతంగా చేశావు.. త్వరలో నేను కూడా చేస్తా" అని వార్నర్‌ పేర్కొన్నాడు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌ చేస్తూ డేవిడ్‌ వార్నర్‌ సోషల్ మీడియాలో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే.

చదవండి: IPL 2022: 'ధావన్‌తో ఓపెనింగ్‌ చేసే అవకాశం రావడం నా అదృష్టం'

Advertisement
 
Advertisement
Advertisement