23 ఏళ్ల తర్వాత మళ్లీ  చాంపియన్‌గా.. రికార్డుస్థాయిలో | Durand Cup 2023: Mohun Bagan Beat East Bengal To Win Title After 23 Years - Sakshi
Sakshi News home page

23 ఏళ్ల తర్వాత మళ్లీ  చాంపియన్‌గా.. రికార్డుస్థాయిలో

Sep 4 2023 12:34 PM | Updated on Sep 4 2023 12:51 PM

Durand Cup 2023: Mohun Bagan Beat East Bengal Win Title After 23 Years - Sakshi

కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ డ్యూరాండ్‌ కప్‌ను మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ క్లబ్‌ జట్టు రికార్డుస్థాయిలో 17వ సారి సొంతం చేసుకుంది. ఫైనల్లో మోహన్‌ బగాన్‌ క్లబ్‌ 1–0తో ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌ను ఓడించి 23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో మళ్లీ  చాంపియన్‌గా నిలిచింది.

ఆట 71వ నిమిషంలో పెట్రాటోస్‌ చేసిన గోల్‌తో మోహన్‌ బగాన్‌ క్లబ్‌ గెలిచింది. 135 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మోహన్‌ బగాన్, ఈస్ట్‌ బెంగాల్‌ జట్లు 16 సార్లు చొప్పున విజేతగా నిలిచి అత్యధికసార్లు టైటిల్‌ నెగ్గిన జట్టుగా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తాజా టైటిల్‌తో మోహన్‌ బగాన్‌ టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చింది.  

Advertisement
 
Advertisement
Advertisement