ఫైనల్‌కు విజయం దూరంలో... | India's Second Win In South Asian Women's Football Championship | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు విజయం దూరంలో...

Jun 2 2026 10:00 AM | Updated on Jun 2 2026 12:29 PM

India's Second Win In South Asian Women's Football Championship

దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ సెమీస్‌లో భారత్‌

మడ్గావ్‌: సొంతగడ్డపై జరుగుతున్న దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయంతో అదరగొట్టింది. బంగ్లాదేశ్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘బి’ రెండో మ్యాచ్‌లో భారత్‌ 3–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. తద్వారా గ్రూప్‌ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టాపర్‌గా నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

రేపు జరిగే సెమీఫైనల్లో భూటాన్‌ జట్టుతో భారత్‌ తలపడుతుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ప్యారీ జక్సా (36వ నిమిషంలో), లిండా కోమ్‌ సెర్టో (78వ నిమిషంలో), మాళవిక (90+1వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. తొలి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 11–0 గోల్స్‌ తేడాతో మాల్దీవులు జట్టును చిత్తు చేసింది.

తెలంగాణ క్రీడాకారిణి సౌమ్య గుగులోత్‌ ఈ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గ్రూప్‌ ‘ఎ’ నుంచి నేపాల్, భూటాన్‌ జట్లు... గ్రూప్‌ ‘బి’ నుంచి బంగ్లాదేశ్‌ కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఎనిమిదోసారి దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న భారత జట్టు ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement