
మాంచెస్టర్ టెస్టును టీమిండియా ఆద్వితీయ పోరాటంతో డ్రా ముగించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తమ ఆశలను భారత్ సజీవంగా నిలుపునకుంది. ఓవర్ నైట్‌స్కోర్ 171/2తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. కేఎల్ రాహుల్(90) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది.
లంచ్ విరామానికి ముందు ఇన్‌ఫామ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(103) కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ ఓటమి తప్పదని అంతా భావించారు. ఈ క్రమంలో సర్ రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్బుతం చేశారు. వీరిద్దరూ తమ ఆసాధరణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ ప్లేయర్లు విసుగుతెప్పించారు.
ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి ఈ జోడీని ఇంగ్లండ్ విడగొట్టలేకపోయింది. ఇద్దరూ కలసి ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. అయితే వీరిని ఔట్ చేయలేక అలిసిపోయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. 15 ఓవర్ల ఆట మిగిలూండగానే చేతులెత్తేశాడు.
స్టోక్స్ డ్రా ఆఫర్ చేస్తూ రవీంద్ర జడేజా వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందుకు జడేజా తిరస్కరించాడు. నాకేమి సంబంధం లేదు, కెప్టెన్ చెప్పినట్లు చేస్తా అని జడ్డూ సమాధనమిచ్చాడు. అయితే అప్పటికే రవీంద్ర జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 80 పరుగులు చేసి సెంచరీలకు చేరువలో ఉన్నారు.
అందుకే వారిద్దరూ డ్రాకు అంగీకరించలేదు. దీంతో సహనం కోల్పోయిన స్టోక్స్ తన నోటికి పనిచెప్పాడు. బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్‌లో సెంచరీలు చేయాలనుకుంటున్నారా అంటూ జడేజాతో వెటకారంగా అన్నాడు. ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా స్టోక్స్‌కు జతయ్యారు. జాక్ క్రాలీ డ్రాకు ఒప్పుకొవచ్చుగా అని జడేజాతో అన్నాడు.
కానీ జడేజా, సుందర్ మాత్రం ఒకే మాటపై ముందుకు వెళ్లారు. స్టోక్స్ అన్నవిధంగానే పార్ట్ టైమ్ స్పిన్నర్ హ్యారీ బ్రూక్‌కు బంతి అందించాడు. బ్రూక్ గల్లీ క్రికెట్‌లో బౌలింగ్ చేసినట్లు చేశాడు. అతడి బౌలింగ్‌లోనే సిక్స్ బాది జడేజా(107) సెంచరీ పూర్తి చేసుకోగా.. ఆ తర్వాత రెండు ఓవర్లకే సుందర్(101) తన తొలి టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో స్టోక్స్ ప్రవర్తనపై నెటిజన్లు ఫైరవతున్నారు. అస్సలు నీకు క్రీడాస్పూర్తి ఉందా? ఆ స్దానంలో మీ ప్లేయర్లు ఉంటే ప్రత్యర్ధి కెప్టెన్ ఇలా చేస్తే ఊరుకుంటావా? అని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
Scored a hundred, saved the Test, farmed ♾ aura! 💁♂#RavindraJadeja didn't hesitate, till the end 👀#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/cc3INlS07P
— Star Sports (@StarSportsIndia) July 27, 2025