స్నేహితులకు ముఖ్య గమనిక.. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు నన్ను టికెట్లు అడగొద్దు: కోహ్లి | Virat Kohli Humble Message To His Friends Not To Ask For Match Tickets Ahead Of World Cup, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli-Anushka Sharma: స్నేహితులకు ముఖ్య గమనిక.. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు టికెట్లు అడగొద్దు

Published Wed, Oct 4 2023 4:19 PM

Dont Request For Tickets, Virat Kohli Humble Message To Friends Ahead Of World Cup - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన స్నేహితులందరికీ ఓ ఇంపార్టెంట్‌ మెసేజ్‌ను పాస్‌ చేశాడు. త్వరలో ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు సంబంధించి, తనను ఎవరూ టికెట్లు అడగ వద్దని విన్నవించుకున్నాడు. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారికి టికెట్లు దొరకపోతే, ఇంట్లో కూర్చొని హాయిగా టీవీల్లో మ్యాచ్‌లు చూడాలని సూచించాడు. ఈ మెసేజ్‌ను కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. 

కాగా, గతంలో కొందరు స్టార్‌ క్రికెటర్లకు ఎదురైన అనుభవాల దృష్ట్యా విరాట్‌ తన స్నేహితులకు ఈమేరకు నిర్ధేశకం చేసినట్లు తెలుస్తుంది. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్‌కప్‌ సందర్భంగా కొందరు భారత స్టార్‌ క్రికెటర్లు తమ స్నేహితుల నుంచి టికెట్ల కోసం తారా స్థాయిలో విన్నపాలు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను వారు అప్పట్లో చాలా సందర్భాల్లో మీడియాతో షేర్‌ చేసుకున్నారు. సదరు క్రికెటర్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కోహ్లి ఈ మెసేజ్‌ను సోషల్‌మీడియా ద్వారా తన స్నేహితులతో పంచుకున్నాడు.

మరోవైపు కోహ్లి షేర్‌ చేసిన మెసేజ్‌ను అతని భార్య, ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కూడా తన ప్రొఫైల్‌ ద్వారా షేర్‌ చేసింది. కోహ్లి సమాధానం ఇవ్వకపోతే టికెట్ల కోసం తనను అభ్యర్థించవద్దని ఆమె కూడా వేడుకుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటు అనుష్క తన ప్రొఫైల్‌ స్టోరీలో రాసుకొచ్చింది. 

ఇదిలా ఉంటే, భారత్‌ వేదికగా రేపటి నుంచి (అక్టోబర్‌ 5) వన్డే వరల్డ్‌కప్‌ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు జరుగబోయే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌-గత ఎడిషన్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. మెగా టోర్నీలో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆడనుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. ఆసీస్‌తో తలపడుతుంది. ఆతర్వాత అక్టోబర్‌ 14న భారత్‌.. తమ చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొంటుంది. 

వరల్డ్‌కప్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ షమీ, మొహమ్మద్‌ సిరాజ్‌

Advertisement
 
Advertisement