2017 తర్వాత మళ్లీ టైటిల్‌...  | Dimitrov won the ninth singles title of his career | Sakshi
Sakshi News home page

2017 తర్వాత మళ్లీ టైటిల్‌... 

Jan 8 2024 4:22 AM | Updated on Jan 8 2024 4:22 AM

Dimitrov won the ninth singles title of his career - Sakshi

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బల్గేరియా టెన్నిస్‌ స్టార్‌ దిమిత్రోవ్‌ తన కెరీర్‌లో తొమ్మిదో సింగిల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన బ్రిస్బేన్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో 32 ఏళ్ల దిమిత్రోవ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో 14వ ర్యాంకర్‌ దిమిత్రోవ్‌ 7–6 (7/5), 6–4తో 8వ ర్యాంకర్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)పై గెలిచి 95,340 డాలర్ల (రూ. 79 లక్షల 30 వేలు) ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. దిమిత్రోవ్‌ చివరిసారి 2017 నవంబర్‌ 17న ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గాడు. 

Advertisement
 
Advertisement
Advertisement