సానియా–షోయబ్‌ మధ్య విభేదాలు!  | Sakshi
Sakshi News home page

సానియా–షోయబ్‌ మధ్య విభేదాలు! 

Published Sat, Aug 5 2023 4:06 AM

Differences between Sania Shoaib - Sakshi

ముంబై: భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో విడిపోయిందా! గతంలో కూడా పలుమార్లు వీరి విడాకులపై పుకార్లు రావడం, వాటిని సన్నిహితులు ఖండించడం జరిగాయి. అయితే ఈసారి జరిగిన పరిణామం మరోసారి అదే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. షోయబ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి రిలేషన్‌షిప్‌ స్టేటస్‌లో చేసిన మార్పుతో ఈ చర్చ మొదలైంది.

ఇప్పటివరకు షోయబ్‌ ప్రొఫైల్‌లో ‘సూపర్‌ ఉమన్‌ సానియా హజ్బెండ్‌’ అంటూ ఉండగా, ఇప్పుడు మారి ‘ఫాదర్‌ టు వన్‌’ అని వచ్చింది. దీంతో వీరిద్దరు విడిపోయారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వారి వ్యక్తిగత వ్యవహారమని, దీనిపై ఏ రకంగా వారు స్పందించదల్చుకోలేదని సానియా కుటుంబ వర్గాలు వెల్లడించాయి. సానియా, షోయబ్‌ మధ్య 2010లో పెళ్లి జరగ్గా... 2018లో కొడుకు ఇజ్‌హాన్‌ పుట్టాడు.    

Advertisement
 
Advertisement