ధనంజయ సెంచరీ.. డ్రా అయ్యే అవకాశమే ఎక్కువ | Dhananjaya De Silva Super Century Against West Indies 2nd Test | Sakshi
Sakshi News home page

WI vs SL: ధనంజయ సెంచరీ.. డ్రా అయ్యే అవకాశమే ఎక్కువ

Dec 3 2021 7:43 AM | Updated on Dec 3 2021 7:52 AM

Dhananjaya De Silva Super Century Against West Indies 2nd Test - Sakshi

గాలే: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్‌ ధనంజయ డిసిల్వా అజేయ సెంచరీ (153 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కదం తొక్కాడు. దాంతో గురువారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. ప్రస్తుతం శ్రీలంక 279 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 46/2తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంకను ధనంజయ ఆదుకున్నాడు. నిసంక (66; 4 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 78 పరు గులు... లసిత్‌ ఎంబుల్దేనియా (25 బ్యాటింగ్‌; 1 ఫోర్‌)తో కలిసి అబేధ్యమైన  తొమ్మిదో వికెట్‌కు 107 పరుగులు జోడించాడు. ఫలితంగా శ్రీలంక పటిష్ట స్థితిలో నిలిచింది. ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసే అవకాశం ఉంది.    

Advertisement
 
Advertisement
Advertisement