IPL: ధోనికి ఇదే చివరి సీజన్‌?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా | Definitely Not: Suresh Raina If CSK vs RR IPL 2024 Match was Dhoni Last in Chennai | Sakshi
Sakshi News home page

IPL: ధోనికి ఇదే చివరి సీజన్‌?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా

May 13 2024 4:54 PM | Updated on May 13 2024 5:12 PM

Definitely Not: Suresh Raina If CSK vs RR IPL 2024 Match was Dhoni Last in Chennai

సురేశ్‌ రైనా(PC: IPL)

ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా చెపాక్‌ స్టేడియం అద్భుత దృశ్యానికి వేదికైంది. రాయల్స్‌పై విజయానంతరం సీఎస్‌కే స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని స్టేడియమంతా కలియదిరుగుతూ టెన్నిస్‌ బంతులు స్టాండ్స్‌లోకి విసిరాడు.

జట్టు వెంటరాగా ముందుండి నడుస్తూ ఉత్సాహంగా కనిపించాడు తలా. దీంతో చెపాక్‌లో ఒకరకమైన భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడింది. 42 ఏళ్ల ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అన్న వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్యాన్స్‌ను తలా వీడ్కోలు పలుకుతున్నట్లుగా అనిపించింది.

ఇక ధోని స్టేడియాన్ని చుట్టేస్తున్న వేళ చిన్న తలా సురేశ్‌ రైనా కూడా జతకలిశాడు. ఈ క్రమంలో రైనాకు కూడా బంతిని ఇచ్చిన తలా​.. అనంతరం అతడిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌ గురించి ఎదురైన ప్రశ్నకు రైనా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. జియో సినిమాలో సహ కామెంటేటర్‌ అభినవ్‌ ముకుంద్‌ రైనాను ఉద్దేశించి.. ఒక యుగం ముగిసిపోయినట్లేనా? అని అడిగాడు.

ఇందుకు రైనా బదులిస్తూ.. ‘‘కచ్చితంగా కానే కాదు’’ అని పేర్కొన్నాడు. దీంతో తలా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. మిస్టర్‌ ఐపీఎల్‌గా పేరొందిన సీఎస్‌కే మాజీ స్టార్‌ రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024 లీగ్‌ దశలో చెన్నైలో సీఎస్‌కే తమ చివరి మ్యాచ్‌ ఆడేసింది. రాజస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్‌ రేసులో మరో ముందడుగు వేసింది. కాగా క్వాలిఫయర్‌-2, ఫైనల్‌ మాత్రం చెపాక్‌ వేదికగానే జరుగనున్నాయి.

చదవండి: ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్‌స్టార్‌? గుర్తుపట్టారా?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement