CWC 2023: బంగ్లాదేశ్‌ ముందు నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచిన నెదర్లాండ్స్‌ | CWC 2023: Netherlands Set 230 Runs Target To Bangladesh | Sakshi
Sakshi News home page

CWC 2023: బంగ్లాదేశ్‌ ముందు నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచిన నెదర్లాండ్స్‌

Oct 28 2023 6:07 PM | Updated on Oct 28 2023 6:15 PM

CWC 2023: Netherlands Set 230 Runs Target To Bangladesh - Sakshi

కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 28) జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్‌ నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 229 పరుగులకు ఆలౌటైంది.

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (68) అర్ధసెంచరీతో రాణించగా.. వెస్లీ బరెస్సీ (41), సైబ్రాండ్‌ (35), లొగాన్‌ వాన్‌ బీక్‌ (23 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

విక్రమ్‌జిత్‌ సింగ్‌ (3), మ్యాక్స్‌ ఒడౌడ్‌ (0), కొలిన్‌ అకెర్‌మెన్‌ (15), బాస్‌ డి లీడ్‌ (17), షరిజ్‌ అహ్మద్‌ (6), ఆర్యన్‌ దత్‌ (9), పాల్‌ వాన్‌ మీకెరెన్‌ (0) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, మెహిది హసన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్‌ షకీబ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నెదర్లాండ్స్‌ చివరి స్థానంలో, బంగ్లాదేశ్‌ ఎనిమిదో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సౌతాఫ్రికా, భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ప్రస్తుతానికి టాప్‌-4లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement