ఖేల్‌ రత్న అవార్డుకు రోహిత్‌ శర్మ నామినేట్‌

Cricketer Rohit Sharma Among Four Others Picked For Khel Ratna Award - Sakshi

ఢిల్లీ : క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ పేరును క్రీడా మంత్రిత్వశాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతనితో పాటు రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్‌ మరియప్పన్‌ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 మంది సెలక్షన్‌ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మక అవార్డుకు వీరిని నామినేట్‌ చేసినట్లు మంగళవారం పేర్కొంది. అత్యున్న‌త క్రీడా అవార్డుకు న‌లుగురు క్రీడాకారులు నామినేట్ కావ‌డం ఇది రెండ‌వ‌సారి. 2016లో కూడా న‌లుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. (చదవండి : ఐపీఎల్‌ 2020 టైటిల్‌ స్పాన్సర్‌ డ్రీమ్‌ 11

2019 ఏడాదిలో రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఆ సీజ‌న్‌లో రోహిత్ వ‌న్డేల్లో ఏడు సెంచ‌రీలతో మొత్తం 1490 ర‌న్స్ చేశాడు. కాగా 2019 ఏడాది క్రికెట్‌లో అత్యున్నత ప్రదర్శనకు గానూ రోహిత్‌ శర్మను ప్రతిష్టాతక్మ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కమిటీలో సభ్యుడైన మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. 2018లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌, ఎషియన్‌ గేమ్స్‌లో బంగారు పతకాలు, 2019 ఏసియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం సాధించి వినేశ్ ఫోగట్‌ చరిత్ర సృష్టించారు.

మరియప్పన్‌ తంగవేలు..  2016లో రియో పారాఒలింపిక్స్‌లో టి42 హై జంప్‌ కేటగిరి విభాగంలో బంగారు పతకం సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పాడు. టేబుల్‌ టెన్నిస్‌ సంచలనంగా పేరు పొందిన మనిక బాత్రా 2018 నుంచి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకం, ఏసియన్‌ గేమ్స్‌లో క్యాంస్య పతకం సాధించి తన సత్తాను చాటింది.(కోహ్లి.. అప్పుడే 12 ఏళ్లయిందా!)

కాగా ఇండియన్‌ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ కంటే ముందు ముగ్గురు మాత్రమే రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌(1998), టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని(2007), ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(2018)లో ఎంపికయ్యారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top