కోల్‌కతా నైట్ రైడర్స్ కథ మారలేదు. ఐపీఎల్-2026లో కేకేఆర్ ఐదో ఓటమిని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఇంత వరకు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గెలుపున్నదే ఎరుగని ఏకైక జట్టుగా కేకేఆర్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ నాయకత్వ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారథి అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ జట్టులో శుద్ధ దండగ అంటూ మండిపడ్డాడు. కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో రహానే డకౌట్ కాగా.. రింకూ ఒకే ఒక్క పరుగు చేశాడు.
వీరిద్దరి వైఫల్యం కారణంగా మిగతా బ్యాటర్ల మీద భారం పడగా.. వాళ్లు ఒత్తిడిలో చిత్తయ్యారు. రూ. 25 కోట్ల ఆటగాడు కామెరాన్ గ్రీన్ 79 పరుగులతో కేకేఆర్ టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ కేకేఆర్ తీరును విమర్శించాడు.
మీ కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ
‘‘వాళ్లు కనీసం 200 పరుగులైనా చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లు. ఫైనల్ ఓవర్లలో కేకేఆర్ పూర్తిగా తడబడింది. ఇక కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రింకూ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.
ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. అసలు ఏం చేస్తున్నామన్న సోయి కూడా ఉన్నట్లు కనిపించలేదు. ఇద్దరూ ఫామ్‌లేమితో సతమతమవుతున్నారు. జట్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ శుద్ధ దండగ అయినప్పుడు ఇక జట్టు సభ్యులు ఎలా ఆడతారో మనం అర్థం చేసుకోవచ్చు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.
దారుణంగా విఫలమవుతున్న రింకూ
కాగా అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో రహానే ఇప్పటికి 152 పరుగులు చేయగా.. రింకూ కేవలం 79 పరుగులే చేశాడు.
చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్!
2⃣ points in the bag ✅
Hat-trick of wins ✅@gujarat_titans wrap a fantastic all-round show at home 🥳🏠
Scorecard ▶️ https://t.co/FACeUzse3B#TATAIPL | #KhelBindaas | #GTvKKR pic.twitter.com/mVnSg3ZI5p— IndianPremierLeague (@IPL) April 17, 2026


