ఫైనల్లో బోపన్న జోడీ  | Bopanna Jodi in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో బోపన్న జోడీ 

Mar 29 2024 2:13 AM | Updated on Mar 29 2024 2:13 AM

Bopanna Jodi in the final - Sakshi

ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నిలో భారత స్టార్‌ రోహన్‌ బోపన్న డబుల్స్‌ విభాగంలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) ద్వయం 6–1, 6–4తో నాలుగో సీడ్‌ మార్సెల్‌ గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)–హొరాసియో జెబలాస్‌ (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది.

53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ రెండు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేశారు. క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 3–6, 7–6 (7/3), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జాన్‌ ప్యాట్రిక్‌ స్మిత్‌ (ఆ్రస్టేలియా)–సెమ్‌ వెర్‌బీక్‌ (నెదర్లాండ్స్‌) జోడీపై గెలిచింది. భారత్‌కే చెందిన మహేశ్‌ భూపతితో కలిసి బోపన్న చివరిసారి 2012లో మయామి ఓపెన్‌ టోర్నీ డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించి ఓడిపోయాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement