బోపన్న జోడీ అవుట్‌ | Bopanna-Eben duo loses in Monte Carlo | Sakshi
Sakshi News home page

బోపన్న జోడీ అవుట్‌

Apr 11 2024 10:02 AM | Updated on Apr 11 2024 10:02 AM

Bopanna-Eben duo loses in Monte Carlo - Sakshi

మోంటెకార్లో (మొనాకో): పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోరీ్నలో టాప్‌ సీడ్‌ బోపన్న–ఎబ్దెన్‌ ద్వయం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది.

తొలి రౌండ్‌ ‘బై’ పొందిన బోపన్న–ఎబ్డెన్‌ జంట బుధవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 3–6, 6–7 (6/8)తో మాట్‌ పావిచ్‌ (క్రొయేషియా)–మార్సెలో అరెవాలో (ఎల్‌ సాల్వడార్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 25,510 యూరోల (రూ. 22 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Advertisement
 
Advertisement
Advertisement