breaking news
tennis doubles title
-
బోపన్న జోడీ అవుట్
మోంటెకార్లో (మొనాకో): పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో టాప్ సీడ్ బోపన్న–ఎబ్దెన్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. తొలి రౌండ్ ‘బై’ పొందిన బోపన్న–ఎబ్డెన్ జంట బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–6, 6–7 (6/8)తో మాట్ పావిచ్ (క్రొయేషియా)–మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 25,510 యూరోల (రూ. 22 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
-
సాయిదేదీప్య జోడీకి టైటిల్
హైదరాబాద్: ఐటా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ హైదరాబాదీ క్రీడాకారిణి సాయిదేదీప్య డబుల్స్ టైటిల్ నెగ్గింది. హరియాణాలోని కర్నాల్‌లో గురువారం జరిగిన మహిళల డబుల్స్ తుదిపోరులో దేదీప్య-హిమాని మోర్ (హరియాణా) జోడి 6-4, 6-3తో యుబ్రాని బెనర్జీ (బెంగాల్)- నీరు రపేరియా (హరియాణా) జంటపై విజయం సాధించింది.