Bengaluru Open: సెమీస్‌లో సాకేత్‌ జంట | Bengaluru Open 2 ATP: Saketh Ramkumar Pair Enters Semis | Sakshi
Sakshi News home page

Bengaluru Open: సెమీస్‌లో సాకేత్‌ జంట

Feb 18 2022 9:05 AM | Updated on Feb 18 2022 9:09 AM

Bengaluru Open 2 ATP: Saketh Ramkumar Pair Enters Semis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు ఓపెన్‌–2 ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్, భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 6–4, 7–6 (7/3)తో వ్లాదిస్లావ్‌ ఒర్లోవ్‌ (ఉక్రెయిన్‌)–కాయ్‌ వెనల్ట్‌ (జర్మనీ) జోడీపై గెలిచింది.

మరో క్వార్టర్‌ ఫైనల్లో విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) ద్వయం 6–3, 4–6, 11–9తో కలోవెలోనిస్‌ (గ్రీస్‌)–మత్సుయ్‌ (జపాన్‌) జంటను ఓడించి సెమీఫైనల్‌ చేరింది.   

క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక 
సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణులు రష్మిక, సామ సాత్విక, శ్రావ్య శివాని క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. గురుగ్రామ్‌లో గురువారం జరిగిన సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో రష్మిక 6–2, 6–2తో హుమేరాపై, సాతి్వక 7–6 (7/1), 7–5తో స్మృతి భాసిన్‌పై గెలిచారు. పూజా ఇంగ్లేతో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్‌లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయంతో వైదొలిగింది. డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రషి్మక–హుమేరా జంట 7–5, 2–6, 10–7తో షర్మదా బాలు–శ్రావ్య శివాని జోడీని ఓడించి సెమీఫైనల్‌ చేరింది.    

Advertisement
 
Advertisement
Advertisement