
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు తమ సెంచరీలకు దగ్గరగా ఉన్నప్పుడు స్టోక్స్.. కరచాలనం చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని కోరుకున్నాడు.
ఇంకా అప్పటికి 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది. స్టోక్స్ ప్రతిపాదనను జడేజా, సుందర్‌లు తిరష్కరించారు. దీంతో స్టోక్స్ ఫ్రస్ట్రేషన్ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో స్టోక్స్‌తో పాటు తన సహచర ఆటగాళ్లు తమ నోటికి పనిచెప్పారు. క్రీడాస్పూర్తిని మరిచి గల్లీ క్రికెటర్‌లా ప్రవర్తించారు.
టీమిండియాకు డ్రాకు ఒప్పుకోలేదనో అక్కసుతో బ్రూక్‌తో స్టోక్స్ బౌలింగ్ చేశాడు. సాధరణంగా బ్రూక్ చాలా సందర్భాల్లో పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా తన సేవలను అందించాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం బ్రూక్ స్లోగా ఫుల్ టాస్‌లు వేస్తూ, ఈజీగా పరుగులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బౌలింగ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ భారత అభిమానుల అగ్రహానికి గురయ్యాడు.
కాగాఈ హ్యాండ్‌షేక్ వివాదంపై మ్యాచ్ అనంతరం స్టోక్స్ స్పందించాడు. డ్రా తప్పదనే ఉద్దేశ్యంతో ముందుగానే హ్యాండ్ షేక్ ఇవ్వాలనుకున్నాను స్టోక్స్ తెలిపాడు.
"రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. మ్యాచ్‌ను వారికి అనుకూలంగా మార్చుకోవడంలో వీరిద్దరి భాగస్వామ్యం కీలకం మారింది. వారు బాగా ఆడారని అప్పటికే మేము ఒప్పుకొన్నాము . 80,90 పరుగులతో నాటౌట్‌గా ఉండి జట్టును క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడడం కంటే, సెంచరీ చేసి ఆజేయంగా డ్రెసింగ్స్ రూమ్‌కు వెళ్లడం ఎక్కువ సంతృప్తి ఇస్తుందని నేను అనుకోవడం లేదు.
సెంచరీకి 10 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ ఏదైనా సరే ఫలితం మాత్రం మారదు. ఆ విషయం వారికి కూడా తెలుసు. చాలా క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును కాపాడడంలో విజయం సాధించారు. చివరి మ్యాచ్ కంటే ముందు సిరీస్ ఓటమి నుంచి మీ జట్టును కాపాడారు. అంతకుమించి ఇంకేమి కావాలి.
అందుకే బ్రూక్‌కు ఇచ్చా..
ఈ మ్యాచ్‌లో ఫలితం వచ్చే వచ్చే అవకాశం లేనందున, మిగిలిన ఓవర్లను ఫ్రంట్‌లైన్ బౌలర్లతో బౌలింగ్ చేయించి రిస్క్ తీసుకోడదని భావించాను. మా ప్రధాన బౌలర్లు వర్క్‌లోడ్ కారణంగా చాలా ఇబ్బందిపడ్డారు.
అందుకే బ్రూక్‌తో బౌలింగ్ చేయించాను.
ఎటువంటి స్టుపిడ్ పనులు చేయోద్దని బ్రూక్‌కు బంతి ఇచ్చే ముందు చెప్పా. మేము అప్పటికే ఎక్కువ సమయం ఫీల్డింగ్ చేసి అలిసిపోయాము. కానీ పరుగులిచ్చి మ్యాచ్‌ను తొందరగా ముగించాలని మేము అనుకోలేదు. సహజంగా మనం బౌలింగ్ చేయకపోయినా కూడా ఫీల్డ్‌లో ఉంటే అలసట వస్తుంది.
అందుకే డ్రాకు వెళ్లాలని భావించాను. గంట ఆట మాత్రమే ఉన్నప్పుడు డ్రా కోసం షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోవచ్చు. కానీ అందుకు భారత్ తిరష్కరించింది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా