నాన్నకు బాగా లేకపోవడం వల్లే...

BCCI Explains Why Rohit Sharma Didn not Travel to Australia - Sakshi

ముంబై: రోహిత్‌ శర్మ తన సహరులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్‌నెస్‌ సమస్య కారణం కాదని బీసీసీఐ కొత్తగా తేల్చి చెప్పింది. రోహిత్‌ విషయంలో వరుస వివాదాలు, కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తకరంగా మారింది. ‘తన తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్‌ ఐపీఎల్‌ తర్వాత నేరుగా ముంబైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి రోహిత్‌ ఎన్‌సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్‌ను ప్రారంభించాడు’ అని బోర్డు స్పష్టం చేసింది. డిసెంబర్‌ 11న రోహిత్‌ ఫిట్‌నెస్‌ను మరోసారి సమీక్షిస్తామని పేర్కొంది.  

ఇషాంత్‌ పూర్తిగా దూరం...
గాయంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాంత్‌ శర్మ మిగిలిన రెండు టెస్టులనుంచి కూడా తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పక్కటెముకల గాయంనుంచి పూర్తిగా కోలుకున్నా...టెస్టు మ్యాచ్‌లు ఆడే ఫిట్‌నెస్‌ స్థాయిని అతను ఇంకా అందుకోలేదని బోర్డు వెల్లడించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top