సెంచరీతో కదంతొక్కిన లిట్టన్‌ దాస్‌.. ఆఫ్ఘన్‌ ముందు భారీ లక్ష్యం | BAN VS AFG one off test: Litton Das Completes his 7th Test Century | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదంతొక్కిన లిట్టన్‌ దాస్‌.. ఆఫ్ఘన్‌ ముందు భారీ లక్ష్యం

Oct 12 2026 3:23 PM | Updated on Oct 12 2026 3:26 PM

BAN VS AFG one off test: Litton Das Completes his 7th Test Century

source: X

అబుదాబీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పట్టు సాధించింది. 372-7 స్కోర్‌ వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన ఆ జట్టు, తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కలుపుకుని మొత్తం 479 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ ముందుంచింది.

బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో లిట్టన్‌ దాస్‌ (102) సెంచరీతో కదంతొక్కాడు. నజ్ముల్‌ హసన్‌ షాంటో (82), ముష్ఫికర్‌ రహీం (81), మెహిది హసన్‌ మిరాజ్‌ (52 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు.

ఛేదన ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ 3 పరుగులకే అబ్దుల్‌ మాలిక్‌ (2) వికెట్‌ కోల్పోయింది. 5 ఓవర్ల తర్వాత ఆఫ్ఘన్‌ స్కోర్‌ 18-1గా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ గెలవాలంటే మరో 461 పరుగులు చేయాలి. ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్‌ ఆట నడుస్తోంది.

అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రహ్మత్‌ షా (105 నాటౌట్‌) బాధ్యతాయుతమైన సెంచరీతో ఆఫ్ఘన్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా, షా పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో షాతో పాటు ఓపెనర్‌ అబ్దుల్‌ మాలిక్‌ (62) మాత్రమే రాణించాడు. బంగ్లా పేసర్‌ హసన్‌ మహ్ముద్‌ హ్యాట్రిక్‌ సహా 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. అతడికి ఎబాదత్‌ హొసేన్‌ (4-56), మెహిది హసన్‌ మిరాజ్‌ (1-41) కూడా సహకరించారు. వీరి ధాటికి ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లయ్యారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది. షద్మాన్‌ (67), తంజిద్‌ హసన్‌ (83), లిటన్‌ దాస్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఫ్ఘన్‌ బౌలర్లలో మొహమ్మద్‌ సలీమ్‌ సఫీ 4 వికెట్లతో రాణించాడు. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 'సిక్సర్ల' ప్రపంచ రికార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement