
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి దాదాపుగా రెండేళ్లవుతుంది. అతని చివరి సెంచరీ కూడా పసికూన నేపాల్‌పై (వన్డేలో) సాధించాడు.
బాబర్ తన చివరి 10 టెస్ట్‌ల్లో, 10 వన్డేల్లో, 10 టీ20ల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయలేదు. హాఫ్ సెంచరీలు కూడా ఎనిమిదే చేశాడు (40 ఇన్నింగ్స్‌ల్లో). వరుస వైఫల్యాల కారణంగా కెప్టెన్సీ కోల్పోయిన బాబర్.. ప్రస్తుతం జట్టులో చోటును కూడా ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు.
కెరీర్‌లో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నా, బాబర్ ఇప్పటికీ టాప్ బ్యాటర్‌గా ఉండటం నమ్మశక్యంగా లేదు. ఈ దశాబ్దంలో (2020-2025 జూన్ 30 వరకు) అత్యధిక పరుగులు చేసిన అంతర్జాతీయ బ్యాటర్ల జాబితాలో బాబర్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
Babar Azam is currently the leading run-scorer of this decade among all international batters.#ViratKohli #RohitSharma #BabarAzam #CricTracker pic.twitter.com/WfD2qA4Y6H
— CricTracker (@Cricketracker) July 1, 2025
2020-2025 మధ్యకాలంలో బాబర్ 202 ఇన్నింగ్స్‌లు ఆడి 8222 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఈ దశాబ్దంలో ఎవరూ ఇన్ని పరుగులు చేయలేదు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 14600 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు, 102 అర్ద సెంచరీలు ఉన్నాయి.
ఈ దశాబ్దంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానంలో కూడా పాక్ ఆటగాడే ఉండటం విశేషం. ఆ జట్టు వన్డే సారధి మహ్మద్ రిజ్వాన్ ఈ దశాబ్దంలో 191 ఇన్నింగ్స్‌ల్లో 7231 పరుగులు చేశాడు.
బాబర్, రిజ్వాన్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ ఉన్నాడు. బ్రూక్ 2020 నుంచి 2025 జూన్ 30 వరకు 151 ఇన్నింగ్స్‌లు ఆడి 6998 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఉన్నారు.
ఈ దశాబ్ద ఆరంభంలో పెద్దగా ఫామ్‌లో లేని కోహ్లి.. ఇప్పటివరకు 173 ఇన్నింగ్స్‌లు ఆడి 6155 పరుగులు చేయగా.. రోహిత్ 169 ఇన్నింగ్స్‌ల్లో 5982 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి, రోహిత్ టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.