విధ్వంసం సృష్టించిన డేవిడ్‌ వార్నర్‌ | Sakshi
Sakshi News home page

AUS VS WI 1st T20: డేవిడ్‌ వార్నర్‌ విధ్వంసం

Published Fri, Feb 9 2024 2:27 PM

AUS VS WI 1st T20: David Warner Completes Fifty In 22 Balls In His 100th T20 - Sakshi

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్‌లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్‌.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్‌ సెంచరీ బాది ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వార్నర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఆసీస్‌ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోష్‌ ఇంగ్లిస్‌ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్‌) చేసి ఔట్‌ కాగా.. వార్నర్‌ (57), మిచెల్‌ మార్ష్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లిస్‌ వికెట్‌ జేసన్‌ హోల్డర్‌కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్‌ 110/1గా ఉంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ కోవిడ్‌తో బాధపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్‌ ఆడుతున్నాడు. కోవిడ్‌ నిర్ధారణ కావడంతో మార్ష్‌కు బదులు వార్నర్‌ టాస్‌కు వచ్చాడు. 

ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్‌ సిరీస్‌ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్‌, పెర్త్‌ వేదికలుగా జరుగనున్నాయి

Advertisement
 
Advertisement