ట్రావిస్‌ హెడ్‌కు ప్రమోషన్‌.. | AUS vs SL: Travis Head named opening partner for Usman Khawaja in 1st Test | Sakshi
Sakshi News home page

AUS vs SL 1st Test: ట్రావిస్‌ హెడ్‌కు ప్రమోషన్‌..

Jan 28 2025 5:01 PM | Updated on Jan 28 2025 5:43 PM

AUS vs SL: Travis Head named opening partner for Usman Khawaja in 1st Test

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో బుధ‌వారం(జ‌న‌వ‌రి29) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అన్ని విధాల సిద్ద‌మైంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం దుబాయ్‌లో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ ట్రైనింగ్ క్యాంపులో కంగారులు తీవ్రంగా శ్ర‌మించారు.

లంక స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌త్యేకంగా స్పిన్ ట్రాక్‌లను ఏర్పా టు చేసుకుని మ‌రి ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసింది. ఈ టూర్‌కు ఆసీస్ రెగ్యూల‌ర్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూర‌మ‌య్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ ఆసీస్ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌హ‌రించ‌నున్నాడు.

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ 2023-25లో ఆసీస్‌కు ఇదే ఆఖ‌రి సిరీస్‌. కాగా ఆసీస్ ఇప్ప‌టికే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త్‌ను ఓడించి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో క‌మ్మిన్స్ సేన అడుగుపెట్టింది.

ఆసీస్ ఓపెన‌ర్‌గా ట్రావిస్ హెడ్‌..
ఇక శ్రీలంక‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెన‌ర్‌గా స్టార్ బ్యాట‌ర్ ట్రావిస్ హెడ్ బ‌రిలోకి దిగ‌నున్నాడు. ఉస్మాన్ ఖవాజాతో క‌లిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను హెడ్ ప్రారంభించ‌నున్నాడు. జట్టులో సామ్ కాన్‌స్టాస్‌, నాథ‌న్ మెక్‌స్వీనీ ఉన్న‌ప్పటికి ఆసీస్ టీమ్‌ మెనెజ్‌మెంట్ మాత్రం హెడ్‌కే ప్రాధాన్య‌త ఇచ్చింది.

హెడ్ సాధ‌ర‌ణంగా వైట్ బాల్ ఫార్మాట్‌లో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుంటాడు. టెస్టుల్లో మాత్రం ఎక్కువ‌గా మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్ వ‌స్తుంటాడు. అయితే రెడ్‌బాల్ క్రికెట్‌లో కూడా అత‌డు ఓపెనింగ్ వ‌చ్చిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో మ‌రోసారి అత‌డిని ఓపెన‌ర్‌గా పంపి ప‌రీక్షించాల‌ని ఆస్ట్రేలియా టీమ్‌ మెనెజ్‌మెంట్ మాత్రం భావిస్తుంది.

ఈ విష‌యాన్ని ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధ్రువీక‌రించాడు. కాగా వార్న‌ర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెన‌ర్ల‌గా నాథన్ మెక్‌స్వీనీ, సామ్ కాన్‌స్టాస్‌కు సెల‌క్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. నాథన్ మెక్‌స్వీనీ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి కాన్‌స్టాస్ మాత్రం త‌న ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. అయిన‌ప్ప‌ట‌కి లంక‌తో సిరీస్‌కు అత‌డికి ఓపెన‌ర్‌గా చోటు ద‌క్క‌లేదు.

ట్రావిస్ హెడ్ మా ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నాడు. టాపార్డర్డ్‌లో కూడా అత‌డు త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తాడ‌ని భావిస‌తున్నాను. అత‌డు ఏ పొజిషేన్‌లోనైనా ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు. గ‌తంలో భార‌త్‌లో అత‌డు ఓపెన‌ర్‌గా వ‌చ్చి అద్బుత‌మైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. 

దీంతో సెల‌క్ట‌ర్లు మ‌రోసారి ఛాన్స్ ఇచ్చారు అని ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్‌లో స్మిత్ పేర్కొన్నాడు. ఓపెన‌ర్‌గా మూడు టెస్టులు ఆడిన ట్రావిస్‌.. 223 ప‌రుగులు చేశాడు.కాగా హెడ్ అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో 448 ప‌రుగుల‌తో లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్‌గా నిలిచాడు.

శ్రీలంకతో టెస్టులకు ఆసీస్‌ జట్టు:  స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్‌, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టోడ్ మర్ఫీ 
చదవండి: Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్‌
 

Advertisement
 
Advertisement
Advertisement