Asia Cup 2023: భారత బౌలర్ల వైఫల్యం.. బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌ | Asia Cup 2023, India Vs Bangladesh: As Team India Bowlers Failed, Bangladesh Scored 265/8 Against India - Sakshi
Sakshi News home page

Asia Cup 2023: భారత బౌలర్ల వైఫల్యం.. బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌

Sep 15 2023 7:23 PM | Updated on Sep 15 2023 7:45 PM

Asia Cup 2023: As Team India Bowlers Failed, Bangladesh Scored 265 Runs - Sakshi

ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 15) జరుగుతున్న చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్‌.. తొలుత బంగ్లా బ్యాటర్లను గడగడలాడించింది. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో బంగ్లాదేశ్‌ 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేశారు. 

కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్‌ను తొలుత ఆ జట్టు కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (80) ఆదుకోగా.. ఆతర్వాత తౌహిద్‌ హ్రిదోయ్‌ (54) తనవంతు సహకారాన్ని అందించాడు. అయితే షకీబ్‌, తౌహిద్‌ స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో బంగ్లాదేశ్‌ మళ్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో నసుమ్‌ అహ్మద్‌ (44), మెహిది హసన్‌ (29 నాటౌట్‌) మెరుపులు మెరిపించి, బంగ్లాదేశ్‌ భారీ స్కోర్‌ చేసేందుకు తోడ్పడ్డారు.

34.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులుగా ఉన్న బంగ్లా స్కోర్‌.. ఆ తర్వాత 15.5 ఓవర్లలో ఏకంగా 104 పరుగులు జోడించి, 265 పరుగులు చేసిం‍ది. ఇన్నింగ్స్‌ ఆఖర్లో బంగ్లా బ్యాటర్లు చెలరేగి ఆడగా.. భారత బౌలర్లు తేలిపోయారు. ఆఖర్లో భారత బౌలింగ్‌లో లోపాలు స్పష్టంగా కనిపించాయి. శార్దూల్‌ వికెట్లు తీసినా (3/65) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

ఆఖర్లో ప్రసిద్ధ్‌ కృష్ణ (9-0-47-1) కూడా విచ్చలవిడిగా పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా (1/53), అక్షర్‌ పటేల్‌ (1/47) చెరో వికెట్‌ పడగొట్టినా పరుగులు సమర్పించకున్నారు. మొత్తంగా పసికూనలను కంట్రోల్‌ చేయడంతో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఇక్కడ ఏమాత్రం అటుఇటు అయినా ఫలితంగా తారుమారయ్యే ప్రమాదం కూడా ఉంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement