
ఆసియాకప్-2023లో 24 గంటలు గడవకముందే టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ టోర్నీ సూపర్-4లో భాగంగా మంగళవారం కొలంబో వేదికగా శ్రీలంకతో భారత్ తలపడనుంది. పాకిస్తాన్‌పై కొనసాగించిన జోరునే శ్రీలంకపై కూడా కొనసాగించి ఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. అయితే వరుస మ్యాచ్‌ల కారణంగా శ్రీలంకతో పోరుకు ఒకరిద్దరికి విశ్రాంతి ఇవ్వాలని భారత జట్టు మేనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్,మహ్మద్ షమీకి.. శ్రీలంకతో మ్యాచ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతో కిషన్‌ను బెంచ్‌కు పరిమితం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో పేసర్ మహ్మద్ షమీని తీసుకోనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.
శ్రీలంకతో మ్యాచ్‌కు భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
చదవండి: Asia Cup 2023: ఇదేమి బంతిరా బాబు.. దెబ్బకు బాబర్ ఆజం ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్