భారత్‌ స్కోరు 356-2.. వర్షం ఆటంకం! డక్‌వర్త్‌ లూయీస్‌ లెక్కలివే | Asia Cup Super 4, India Vs Pakistan: Here’s DLS Revised Pakistan Target After India Batting - Sakshi
Sakshi News home page

Ind vs Pak: టీమిండియా స్కోరు 356-2.. వర్షం ఆటంకం.. పాకిస్తాన్‌ టార్గెట్‌? 20 ఓవర్లలో..

Sep 11 2023 9:12 PM | Updated on Sep 12 2023 4:43 PM

Asia Cup 2023 Ind vs Pak: DLS Revised Pakistan Target After India Batting - Sakshi

Asia Cup, 2023 Pakistan vs India, Super Fours: టీమిండియాతో మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4.2 ఓవర్లో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది పాక్‌. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఇమామ్‌ శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

పాండ్యా దెబ్బకు.. బాబర్‌ బౌల్డ్‌
మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఇక​ పాక్‌ ఇన్నింగ్స్‌ 10.4 ఓవర్‌ వద్ద భారత పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుత బంతితో పాక్‌ సారథి బాబర్‌ ఆజం(10)ను బౌల్డ్‌ చేశాడు.

వర్షం ఆటంకం
దీంతో పాకిస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలో 11వ ఓవర్‌ వద్ద వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి 2 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసిన పాకిస్తాన్‌.. విజయానికి 313 పరుగుల దూరంలో ఉంది.

అయితే, రిజర్వ్‌ డే మ్యాచ్‌కు కూడా పదే పదే వరణుడు అంతరాయం కలిగిస్తున్న నేపథ్యంలో.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చాలంటే పాకిస్తాన్‌ కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది.

అలా కాకుండా వర్షం కొనసాగుతూనే ఉంటే మ్యాచ్‌ రద్దై ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభిస్తుంది. అలా కాకుండా నిర్ణీత సమయం వరకు మ్యాచ్‌ కొనసాగిన పక్షంలో లక్ష్యం నిర్దేశించాల్సి వస్తే రివైజ్డ్‌ టార్గెట్స్‌ ఇలా ఉండనున్నాయి.

వర్షం అంతరాయం నేపథ్యంలో పాకిస్తాన్‌ లక్ష్యం
20 ఓవర్లలో 200 పరుగులు(అంటే మిగిలిన 9 ఓవర్లలో 156 పరుగులు)
22 ఓవర్లలో 216 పరుగులు
24 ఓవర్లలో 230 పరుగులు
26 ఓవర్లలో 244 పరుగులు

కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ శతకాలు
ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌-2023లో భాగంగా సూపర్‌-4 దశలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు వర్షం అడ్డంకిగా మారింది.

దీంతో 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన టీమిండియా.. సోమవారం ఆట మొదలుపెట్టింది. విరాట్‌ కోహ్లి(122), కేఎల్‌ రాహుల్‌(111) అజేయ శతకాల కారణంగా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు సాధించి.. పాక్‌ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

చదవండి: Virat Kohli: 71 సెంచరీలు.. మూడేళ్లు నిరీక్షణ.. ఆతర్వాత ఏడాదిలో 6 శతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement