
బంగ్లాదేశ్ జట్టు (PC: ICC)
Ebadot Hossain ruled out of Bangladesh's Asia Cup 2023 squad: ఆసియా కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రైట్ ఆర్మ్ పేసర్ ఇబాదత్ హుసేన్ చౌధురి జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా మెగా టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని యువ సంచలనం తంజీమ్ హసన్ సకీబ్‌తో బంగ్లా క్రికెట్ బోర్డు భర్తీ చేసింది.
కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నీకై ఆగష్టు 12న బంగ్లాదేశ్ 17 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేసింది. అదే విధంగా తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్‌లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది.
ఆరు వారాల విశ్రాంతి అవసరం
అయితే, ప్రధాన జట్టులో సభ్యుడైన ఇబాదత్ హుసేన్ పూర్తిగా కోలుకోలేదు. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ అతడికి మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరమైనట్లు బీసీబీ చీఫ్ స్పోర్ట్స్ ఫిజీషియన్ డాక్టర్ దేబాశిష్ చౌధురి తెలిపాడు.
తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న 29 ఏళ్ల ఇబాదత్‌కు ఆరు వారాల పాటు రెస్ట్ కావాలని పేర్కొన్నాడు. కాబట్టి ఆసియా కప్ టోర్నీకి అతడు దూరం కానున్నట్లు దేబాశిష్ వెల్లడించాడు. ఇబాదత్ నొప్పి తీవ్రమైందని.. అయితే, వరల్డ్‌కప్ నాటికి అతడు మైదానంలో దిగే విధంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నాడు.
యువ ఆటగాడికి లక్కీ ఛాన్స్
అవసరమైతే విదేశాల్లో ట్రీట్‌మెంట్ చేయించేందుకు బంగ్లా బోర్డు సిద్ధంగా ఉందని తెలిపాడు. కాగా ఇబాదత్ హుసేన్ దూరమైన కారణంగా తంజీమ్ హసన్ సకీబ్‌కు ప్రమోషన్ లభించింది. అండర్-19 వరల్డ్‌కప్ 2020 గెలిచిన జట్టులో తంజీమ్ సభ్యుడు.
ఇటీవల ముగిసిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఈ రైట్ ఆర్మ్ పేసర్ మూడు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. పల్లకెలె వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌తో బంగ్లాదేశ్ ఆసియా కప్-2023లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఆసియా కప్-2023కి బంగ్లాదేశ్ జట్టు
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్, మహ్మద్ నయీమ్
స్టాండ్ బై ప్లేయర్లు - తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్.
చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్..