Pallekele
-
T20 WC 2026: ఆసీస్‌కు మరో ఘోర అవమానం!
వన్డే ప్రపంచకప్ ఈవెంట్లలో తిరుగులేని జట్టుగా ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియాకు.. టీ20 ఫార్మాట్లో మాత్రం అవమానాలే మిగులుతున్నాయి. పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్కసారి (2021) విజేతగా నిలిచిన కంగారూలు.. తాజా ఎడిషన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు.టీ20 వరల్డ్‌కప్-2026లో గ్రూప్-బిలో భాగంగా తొలుత ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. శ్రీలంక చేతిలోనూ ఓడి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్‌లో ఒమన్ (AUS vs OMA)తో శుక్రవారం ఆసీస్ తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (Jatinder Singh) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఒత్తిడిలో ఉందని.. ఇలాంటి సమయంలో వారిని చిత్తు చేసే సువర్ణావకాశం తమకు ఉందని పేర్కొన్నాడు.ఆసీస్‌ను మేమూ చిత్తుగా ఓడిస్తాం‘‘ఈ మ్యాచ్‌లో మేము గెలిచేందుకు వంద శాతం అవకాశం ఉంది. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సరైన సమయంలో సరైన విధంగా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా గొప్పగా ఏమీ ఆడటం లేదు. వాళ్లు మొమెంటమ్ కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఆసీస్‌ను చిత్తు చేయడం సులభం. మా జట్టు ఈ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తమదైన ముద్ర వేయాలని మా వాళ్లు ఆతురతగా ఎదురుచూస్తున్నారు’’ అని జతిందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.ఘోర అవమానంకాగా ఇప్పటికే జింబాబ్వే వంటి పసికూన చేతిలో ఓడిన ఆసీస్‌కు.. మరో పసికూన జట్టు కెప్టెన్ కూడా ఓడిస్తామంటూ సవాలు విసరడం గమనార్హం. దీంతో ఆసీస్ ఫ్యాన్స్.. ‘‘ఇది ఘోర అవమానం.. ఇకనైనా సరిగ్గా ఆడండి’’ అంటూ మార్ష్ బృందానికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రూప్-బిలో జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఒమన్ ఓడిపోయింది. ఇక 2024 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఆసీస్ చేతిలోనూ చిత్తైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటామని ఒమన్ సానుకూల దృక్పథంతో ఉండటం విశేషం.ఒమన్ జట్టుఅమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (కెప్టెన్), ఆశిష్ ఒడెదర, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), మహ్మద్ నదీమ్, జితేన్ రామనంది, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, షా ఫైసల్, షఫీక్ జాన్, కరణ్ సోనావాలే, జే ఒడెడ్రా, వసీం అలీఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, కూపర్ కొన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షుయిస్, మాట్ రెన్షా, మాథ్యూ కుహ్నెమాన్, స్టీవెన్ స్మిత్.UPDATE: మార్ష్ విధ్వంసం.. పసికూనను చిత్తుచేసిన ఆసీస్చదవండి: T20 WC 2026: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు! -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక చరిత్ర సృష్టించాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో ధనాధన్ దంచికొట్టి.. గతంలో తన పేరిట ఉన్న రికార్డు తానే బద్దలు కొట్టాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక- ఒమన్ గురువారం నాటి మ్యాచ్‌లో ముఖాముఖి ఎదురుపడ్డాయి.కుశాల్ మెండిస్ అర్ధ శతకంపల్లెకెలె వేదికగా టాస్ గెలిచిన ఒమన్.. ఆతిథ్య శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో లంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక (13), కమిల్ మిశారా (8) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అర్ధ శతకంతో అలరించాడు.మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న కుశాల్.. ఏడు ఫోర్ల సాయంతో 61 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ పవన్ రత్ననాయకె ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 28 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్ బాది 60 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ దసున్ శనక సుడిగాలి ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు.కేవలం 19 బంతుల్లోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షనక.. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా శ్రీలంక తరఫున పొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గతంలో పుణె వేదికగా 2023లో టీమిండియాతో మ్యాచ్‌లో షనక 20 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.WHERE’S THE BALL?! 🚀Back-to-back sixes as the Sri Lankan skipper marches towards his fifty, leading from the front and steering SL towards a massive total 👏🔥ICC Men’s #T20WorldCup | #SLvOMA | LIVE NOW 👉 https://t.co/JscJZV8hFa pic.twitter.com/oH7vFDDqqJ— Star Sports (@StarSportsIndia) February 12, 2026ఇక ఒమన్‌తో తాజా మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న దసున్ షనక రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో కమిందు మెండిస్ ఏడు బంతుల్లో 19, దునిత్ వెల్లలగే నాలుగు బంతుల్లో 6 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ ఎడిషన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది రెండు, జే ఒడేరా, సూఫ్యాన్ మెహమూద్ తలా ఒక వికెట్ పడగొట్టారు.శ్రీలంక తరఫున టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీలు సాధించిన ఆటగాళ్లు వీరే🏏దసున్ షనక- 2026 వరల్డ్‌కప్‌లో ఒమన్ మీద 19 బంతుల్లో🏏దసున్ షనక- 2023లో టీమిండియా మీద 20 బంతుల్లో🏏మహేళ జయవర్దనే- 2007 వరల్డ్‌కప్‌లో కెన్యా మీద 21 బంతుల్లో🏏కుమార్ సంగక్కర- 2009లో టీమిండియా మీద 21 బంతుల్లో.చదవండి: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ! -
Asia Cup: కొలంబోలో ఎడతెగని వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం! ఇక..
Asia Cup 2023: కొలంబోలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆసియా క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబోలో వర్షాల నేపథ్యంలో ఆసియా కప్-2023 ఫైనల్ వేదికను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ వన్డే టోర్నీని నిర్వహించేందుకు పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ససేమిరా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనేక చర్చల తర్వాత శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ హైబ్రిడ్ విధానంలో ఆసియా కప్ నిర్వహణకు అంగీకరించింది. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా పాక్ భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగేందుకు వీలుగా ఏసీసీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ స్టేజీలో వివిధ వేదికల్లో నిర్వహించిన మ్యాచ్‌లలో గ్రూప్-ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్నాయి. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరు వర్షార్పణం అయితే, కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పల్లెకెల్లెలో దాయాదుల మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. ఆదివారం నాటి భారత్- పాక్ పోరుకు రిజర్వ్ డే కేటాయించారు. చిరకాల ప్రత్యర్థుల పోటీ నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ వరుణుడు కరుణించే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం 24.1 ఓవర్ల టీమిండియా స్కోరు 147/2 వద్ద ఉండగా ఆటకు ఆటంకం కలిగించిన వర్షం.. సోమవారం కూడా అడ్డంకిగా మారింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్ గంట తర్వాత కూడా ఇంకా ఆరంభం కాలేదు. ఫైనల్ ఒక్కటే కాదు.. ఆ మ్యాచ్‌ల వేదికలోనూ మార్పులు? ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్ వేదిక మార్పుపై ఏసీసీ దృష్టి సారించినట్లు సమాచారం. వాస్తవానికి కొలంబోలో సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆరోజు కూడా వర్షం ముప్పు సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్యాండీలోని పల్లెకెల్లె స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు ఏసీసీ మొగ్గుచూపుతున్నట్లు టైమ్స్‌నౌ తన కథనంలో పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌ల(భారత్- శ్రీలంక, పాక్- శ్రీలంక, భారత్- బంగ్లాదేశ్) మ్యాచ్‌ల వేదికలు కూడా మార్చే యోచనలో ఉన్నట్లు మరో జాతీయ మీడియా పేర్కొంది. చదవండి: చిక్కుల్లో పాక్ క్రికెట్ జట్టు.. ఐసీసీ సీరియస్! ఏమైందంటే? -
మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ అవుట్
Ebadot Hossain ruled out of Bangladesh's Asia Cup 2023 squad: ఆసియా కప్-2023 టోర్నీ ఆరంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రైట్ ఆర్మ్ పేసర్ ఇబాదత్ హుసేన్ చౌధురి జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా మెగా టోర్నీకి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని యువ సంచలనం తంజీమ్ హసన్ సకీబ్తో బంగ్లా క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో ఈ వన్డే టోర్నీకై ఆగష్టు 12న బంగ్లాదేశ్ 17 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేసింది. అదే విధంగా తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. ఆరు వారాల విశ్రాంతి అవసరం అయితే, ప్రధాన జట్టులో సభ్యుడైన ఇబాదత్ హుసేన్ పూర్తిగా కోలుకోలేదు. సొంతగడ్డపై అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డ అతడికి మరికొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరమైనట్లు బీసీబీ చీఫ్ స్పోర్ట్స్ ఫిజీషియన్ డాక్టర్ దేబాశిష్ చౌధురి తెలిపాడు. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న 29 ఏళ్ల ఇబాదత్కు ఆరు వారాల పాటు రెస్ట్ కావాలని పేర్కొన్నాడు. కాబట్టి ఆసియా కప్ టోర్నీకి అతడు దూరం కానున్నట్లు దేబాశిష్ వెల్లడించాడు. ఇబాదత్ నొప్పి తీవ్రమైందని.. అయితే, వరల్డ్‌కప్ నాటికి అతడు మైదానంలో దిగే విధంగా చికిత్స అందిస్తామని పేర్కొన్నాడు. యువ ఆటగాడికి లక్కీ ఛాన్స్ అవసరమైతే విదేశాల్లో ట్రీట్మెంట్ చేయించేందుకు బంగ్లా బోర్డు సిద్ధంగా ఉందని తెలిపాడు. కాగా ఇబాదత్ హుసేన్ దూరమైన కారణంగా తంజీమ్ హసన్ సకీబ్‌కు ప్రమోషన్ లభించింది. అండర్-19 వరల్డ్‌కప్ 2020 గెలిచిన జట్టులో తంజీమ్ సభ్యుడు. ఇటీవల ముగిసిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఈ రైట్ ఆర్మ్ పేసర్ మూడు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. పల్లకెలె వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌తో బంగ్లాదేశ్ ఆసియా కప్-2023లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్-2023కి బంగ్లాదేశ్ జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మముద్, మెహదీ హసన్, నసూమ్ అహ్మద్, షమీమ్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, ఇబాదత్ హుసేన్, మహ్మద్ నయీమ్ స్టాండ్ బై ప్లేయర్లు - తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజీమ్ హసన్ సకీబ్. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. -
లంక స్పిన్ మ్యాజిక్.. ఆసీస్ స్వల్పస్కోరు
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. చివరి వికెట్ గా లియాన్(17)ను సందకన్ పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్లు హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించడంతో 79.2 ఓవర్లలో 203 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌటైంది. ఆసీస్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. లంక తమ తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 6 పరుగుల వద్ద ఓపెనర్ పెరీరా(4) వికెట్ కోల్పోయింది. ఆటగాళ్లు లంచ్ విరామం తీసుకోగా వర్షం ఎడతెరపి లేకుండా కురియడంతో రెండో రోజు ఆట నిలిపివేశారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 66/2తో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ మరో మూడు పరుగులు జోడించగానే మూడో వికెట్ కోల్పోయింది. స్మిత్ (30) హెరాత్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా కీపర్ చండిమాల్ అద్భుతంగా స్టంప్ ఔట్ చేశాడు. హెరాత్ తన మరుసటి ఓవర్లో ఖవాజా(26)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 70 పరుగులకే ఆసీస్ టాపార్డర్ 4 వికెట్లను కోల్పోయింది. మార్ష్ (63 బంతుల్లో 31; 5 పోర్లు), వోజెస్(115 బంతుల్లో 47; 3 పోర్లు) ఐదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ పోరాడకుంటే ఆసీస్ స్కోరు 200 కూడా దాటపోయేది. అక్కడి నుంచి ఆసీస్ వరుస విరామాలలో నెవిల్(2), వోజెస్(47), స్టార్క్(11), కీఫె(23), లియాన్(17) వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించాడు. మరో బౌలర్ ప్రదీప్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (3/12), పేసర్ హాజెల్‌వుడ్ (3/21) ధాటికి లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే ఆలౌటైంది.


