ముంబై ఇండియన్స్‌ కోచ్‌పై రితిక ఫైర్‌.. రోహిత్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే | Always By My Side: Amid MI Captaincy Row, Rohit Reacted To His Wife Post On MI Head Coach Comments - Sakshi
Sakshi News home page

Rohit Sharma: ముంబై ఇండియన్స్‌ కోచ్‌పై రితిక ఫైర్‌.. రోహిత్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ ఇదే

Published Sat, Feb 10 2024 9:28 PM

Always By My Side: Amid MI Captaincy Row Rohit Post For Wife Fans Reacts - Sakshi

Rohit Sharma first reaction after wife Ritika Sajdeh's Mark Boucher response: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సతీమణి రితికా సజ్దేపై ప్రేమను చాటుకున్నాడు. ‘‘నా ప్రేమ.. ఎల్లప్పుడూ నా వెంటే’’ అంటూ రితికాతో కలిసి నడుస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడన్న వార్తల నేపథ్యంలో.. రితికను ఉద్దేశించి అతడు చేసిన పోస్ట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా గుజరాత్‌ టైటాన్స్‌ను అరంగేట్రంలోనే విజేతగా నిలిపిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. తిరిగి ముంబై గూటికి చేరుకున్న విషయం తెలిసిందే.

రోహిత్‌ను తప్పించి.. పాండ్యాకు పెద్దపీట 
ఈ క్రమంలో రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఫ్రాంఛైజీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ముంబై యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐదుసార్లు ట్రోఫీ అందించిన హిట్‌మ్యాన్‌ను కాదని.. పాండ్యాను కెప్టెన్‌ చేయడం ఏమిటని అభిమానులు మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ను ఉద్దేశించి ఇటీవల ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్‌ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ ఆగ్రహాన్ని రెట్టింపు చేశాయి. పనిభారం తగ్గించి.. రోహిత్‌ ఆటను ఆస్వాదిస్తూ.. బ్యాటర్‌గా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అతడు వెల్లడించాడు.

కోచ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన రితిక
ఈ విషయంపై స్పందించిన రితికా సజ్దే .. ‘‘ఇందులో చాలా వరకు తప్పులే ఉన్నాయి’’ అంటూ బౌచర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మకు ముంబై ఇండియన్స్‌తో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపించాయి.

తాజాగా భార్య రితికా తనకు ఎల్లవేళలా తోడుగా ఉంటుందంటూ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించడంతో.. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌ విషయంలో భార్యాభర్తలిద్దరిదీ ఒకే మాట అని హిట్‌మ్యాన్‌ నిరూపించాడని పేర్కొంటున్నారు. 

కాగా రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ చెరో విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. 

చదవండి: Virat Kohli: 13 ఏళ్లలో ఇదే తొలిసారి.. మేమంతా నీతోనే! ఆర్సీబీ ట్వీట్‌ వైరల్‌

Advertisement
Advertisement