అగ్రపీఠంపై అల్‌కరాజ్‌.. గ్రాస్‌ కోర్టుపై తొలి టైటిల్‌ | Alcaraz Wins Queens Club Title, Earns Return To World No 1 | Sakshi
Sakshi News home page

అగ్రపీఠంపై అల్‌కరాజ్‌.. గ్రాస్‌ కోర్టుపై తొలి టైటిల్‌

Jun 26 2023 7:35 AM | Updated on Jun 26 2023 7:35 AM

Alcaraz Wins Queens Club Title, Earns Return To World No 1 - Sakshi

లండన్‌: ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోరీ్నకి సన్నాహకంగా భావించే క్వీన్స్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌లో స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ 6–4, 6–4తో అలెక్స్‌ డి మినౌర్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. 99 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌ స్టార్‌ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సరీ్వస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు.

గ్రాస్‌ కోర్టులపై అల్‌కరాజ్‌కిదే తొలి టైటిల్‌ కావడం విశేషం. ఓవరాల్‌గా అతని కెరీర్‌లో ఇది 11వ సింగిల్స్‌ టైటిల్‌. ఈ స్పెయిన్‌ స్టార్‌కు 4,77,795 యూరోల (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో అల్‌కరాజ్‌ నేడు విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. దాంతోపాటు వచ్చే నెలలో మొదలయ్యే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు.    
 

Advertisement
 
Advertisement
Advertisement