
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు. తన ఎంచుకున్న జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు చోప్రా చోటు ఇవ్వలేదు. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్‌కు అతడు అవకాశమిచ్చాడు.
టాప్ ఆర్డర్‌లో నో ఛేంజ్
గత నాలుగు మ్యాచ్‌లనే భారత ఇన్నింగ్స్‌ను రాహుల్, యశస్వి జైశ్వాల్ ప్రారంభించాలి. మూడో స్ధానంలో సాయిసుదర్శన్ బ్యాటింగ్ రావాలి. ఒకవేళ అతడు ఆడకపోతే కరుణ్ నాయర్‌కు అవకాశం దక్కుతుంది. నాలుగో స్ధానంలో కెప్టెన్ గిల్ బ్యాటింగ్‌కు వస్తాడు.
అందులో ఎటువంటి సందేహం లేదు. రిషబ్ పంత్ జట్టులో ఉండి ఉంటే ఐదో స్ధానం కోసం ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు అతడు స్ధానంలో ధ్రువ్ జురెల్ వస్తాడు. జురెల్‌ను పంత్ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు పంపి, ఆరేడు స్ధానాల్లో వరుసగా జడేజా, సుందర్‌ను ఆడిస్తారో లేదా మార్పులు చేస్తారో వేచి చూడాలి.
గెలవాల్సిందే..
ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్‌ను కోల్పోతుంది. ఈ టెస్టులో టీమిండియా గెలవాలంటే కచ్చితంగా 20 వికెట్లు పడగొట్టాల్సిందే. కాబట్టి బ్యాటింగ్ కంటే బౌలింగ్ డెప్త్‌ను పెంచుకుంటే బాగుంటుంది. అందుకోసం ఆల్‌రౌండర్లను జట్టులో తగ్గించాలి.
వాషింగ్టన్ సుందర్ బదులుగా కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో కరుణ్ నాయర్‌ను ఆడించండి. జట్టులో నలుగురు సరైన బౌలర్లు ఉంటే చాలు. వారితో పాటు జడేజా ఐదో బౌలింగ్ ఆప్షన్‌గా ఉంటాడు అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
ఐదో టెస్టుకు చోప్రా ఎంచుకున్న జట్టు
కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, సాయిసుదర్శన్, శుబ్‌మన్ గిల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్