టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో రెండు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నట్లు సమాచారం.
పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న సుందర్.. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో కోలుకుంటున్నాడు. వాషీ తాజాగా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే ప్రాక్టీస్ సందర్భంగా ఇంకా పక్కటెముకల వద్ద నొప్పి ఉండటంతో అతను ఇబ్బంది పడుతున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలోనే గ్రూప్ స్టేజ్‌లో భారత్ ఆడే రెండు(అమెరికా, నమీబియా) మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు. అయితే ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్ నాటికి సుందర్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"పాక్‌తో మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉంది. అప్పటికి వాషింగ్టన్ సుందర్ కోలుకుంటాడనే నమ్మకంతో ఉన్నాం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేయడానికి అతడు మాకు చాలా ముఖ్యం. ప్రస్తుతం జట్టులో ఆఫ్-స్పిన్ బౌలర్లు తక్కువగా ఉండడంతో రవి బిష్ణోయ్‌ను ఉపయోగించుకుంటున్నాము" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సుందర్‌కు ప్రత్యామ్నాయంగా రవి బిష్ణోయ్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు.
చదవండి: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్


