
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తుది సమరానికి సమయం అసన్నమైంది. ఈ ట్రోఫీలో భాగంగా గురువారం లండన్‌లోని ఓవల్ నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
దీంతో ఓవల్ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది. అయితే భారత ఆశలకు వరుణుడు బ్రేక్ వేసే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం.. గురువారం(జూలై 31) రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.
తొలి రోజు ఆటలో దాదాపు 4 గంటల పాటు వర్షం పడేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్ట్ వెల్లడించింది. మొదటి రోజు మాత్రమే కాకుండా మిగితా నాలుగు రోజులు కూడా తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.
ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం..
ఉదయం 11- 80 % వర్షం పడే అవకాశం
మధ్యాహ్నం 12- 70% వర్షం పడే అవకాశం
మధ్యాహ్నం 1 -70% వర్షం పడే అవకాశం
మధ్యాహ్నం 2- 60% వర్షం పడే అవకాశం
మధ్యాహ్నం 3- 60% వర్షం పడే అవకాశం
సాయంత్రం 4- 60% వర్షం పడే అవకాశం
సాయంత్రం 5- 40% వర్షం పడే అవకాశం
సాయంత్రం 6- 30% వర్షం పడే అవకాశం
ఇంగ్లండ్ వర్సెస్ భారత్ ఐదవ టెస్ట్
వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్
తేదీ: జూలై 31-ఆగస్టు 4
సమయం: భారత కాలమానం ప్రకారం(మధ్యాహ్నం 3:30)
టాస్: మధ్యాహ్నం 3:00 గంటలకు
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్
లైవ్ బ్రాడ్‌కాస్ట్: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్
తుది జట్ల వివరాలు:
భారత్ (అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్‌దీప్, సిరాజ్.
ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్.