నెలకు రూ.71 వేల ఖర్చు.. వైరల్‌గా టెకీ అంజలి వీడియో | ₹71,000 Monthly Expenses Of Bengaluru Techie Spark Debate On City’s Rising Cost Of Living, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

నెలకు రూ.71 వేల ఖర్చు.. వైరల్‌గా టెకీ అంజలి వీడియో

Jun 30 2026 9:48 AM | Updated on Jun 30 2026 11:24 AM

Bengaluru Techie Monthly Expenses Go Viral!

దేశంలోని ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం (Cost of Living) మరోసారి చర్చనీయాంశమైంది. ఓ ఐటీ ఉద్యోగిని తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. తాను మే నెలలో మొత్తం రూ.71 వేల వరకు ఖర్చు చేశానని, అయితే బెంగళూరు వంటి నగరంలో ఇది పెద్ద మొత్తం కాదని చెప్పడంతో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ మొదలైంది.

వీడియోలో టెకీ అంజలి తన ఖర్చులను వివరించింది. తాను ఉంటున్న 1BHK ఫ్లాట్‌కు నెలకు రూ.28 వేల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిపింది. రోజువారీ ఆహారం కోసం సుమారు రూ.7 వేలు ఖర్చవుతాయని పేర్కొంది. వారాంతాల్లో షాపింగ్, బయట తిరగడం వంటి ఖర్చులకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వెచ్చిస్తున్నట్లు వెల్లడించింది.

 

అంతేకాకుండా, ప్రయాణాలను ఇష్టపడే తాను టూర్ల కోసం నెలకు మరో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నానని చెప్పింది. ఈ ఖర్చులన్నీ కలిపి మే నెలలో తన మొత్తం వ్యయం రూ.71 వేలకు చేరిందని వివరించింది. 

అయితే, బెంగళూరులో ఉద్యోగం చేసే వారికి ఇలాంటి ఖర్చులు అసాధారణం కాదని, నగర జీవనశైలికి అనుగుణంగా ఇవి సహజమేనని అంజలి అభిప్రాయపడింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు "బెంగళూరులో అద్దెలు, జీవన వ్యయం నిజంగానే ఎక్కువ" అంటూ ఆమె మాటలకు మద్దతు పలికారు. మరికొందరు మాత్రం "ఈమె కేవలం ఖర్చు పెట్టడానికే పుట్టింది", "ఇంత డబ్బు సేవ్ చేస్తే ఏడాదికి మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది", "ఇది అవసరమైన ఖర్చా.. లేక లైఫ్‌స్టైల్ ఖర్చా?" అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు.

ఈ వీడియోతో మరోసారి బెంగళూరులో పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయం, యువ ఉద్యోగుల లైఫ్‌స్టైల్ ఖర్చులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement