
కరోనా చాలామంది జీవితాల్లో రకరకాల మార్పులు తీసుకొచ్చింది. లాక్‌డౌన్ వల్ల దాదాపు చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చాలాకాలం వరకు షేవింగ్‌కు పనిచెప్పలేదు. జోనాథన్ నార్మోయిల్ అనే ఓ టిక్‌టాక్ యూజర్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యి జుట్టు బాగా పెంచేశారు. అయితే ఆ మధ్యకాలంలో సేమ్ హెయిర్‌స్టైల్ బోర్ కొట్టిందేమో ఒకేసారి షేవ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత ఒక్కసారిగా షేవ్ చేసుకునేసరికి తన ఇద్దరు కవల పిల్లల నుంచి ఊహించని రియాక‌్షన్ ఎదురైంది.
కొన్ని నెలులుగా పెంచుతున్న గడ్డాన్ని ఒకసారిగా షేవ్ చేసుకోవడంతో పిల్లలిద్దరూ ఆతడని గుర్తుపట్టలేకపోయారు. తమ దగ్గరికి ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చాడని గుక్కపెట్టి ఏడ్చేశారు. చిన్నారిని చేతుల్లోకి తీసుకోబోతుండగా, మరో చిన్నారి తన చేతిని అడ్డుపెట్టి తండ్రి నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంటుంది. దీనికి సంబంధించిన వీడియాను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే 40 లక్షల మందికి పైగానే ఈ వీడియోను చూశారు. ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వీడియోను రీట్వీట్ చేస్తూ లక్షల్లో లైకుల వర్షం కురిపిస్తున్నారు.
Father shaved for the very first time,watch his twin kids reaction reaction 😂😭😍 pic.twitter.com/6MJOlFSSCI
— Aqualady𓃤 𓅇 𓅋 𓆘 (@Aqualady6666) March 4, 2021
చదవండి : (వైరల్: చేప కడుపులో తాబేలు చక్కర్లు!)
(గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్ రేజర్)