గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్‌ రేజర్‌

Salon Shop In Maharashtra Using Gold Razor For Attracting Customers - Sakshi

ముంబై : కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బ తిన్న వ్యాపారాలను చక్కబెట్టుకోవటానికి కొత్తకొత్త ఐడియాలతో ముందుకు దూసుకుపోతున్నారు వ్యాపారస్తులు. కస్టమర్లను ఆకర్షించటానికి కొత్తకొత్త పద్దతులు వెతుక్కుకుంటున్నారు. మహారాష్ట్ర, పుణెలోని ఓ సెలూన్‌ షాపు రాజు,పేద తేడా లేకుండా బంగారు రేజర్‌తో గడ్డం గీస్తాం అంటూ కస్టమర్లను బుట్టలో వేసుకుంటోంది. వివరాలు.. పుణెలోని పింపిరిచించ్‌వాడ్‌కు చెందిన అవినాష్‌ బొరుండియాకు ఓ సెలూన్‌ షాపు ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత షాపులు తెరిచినప్పటికి ఆశించినంత ప్రయోజనం లేకపోయింది. కస్టమర్లు కూడా చాలా తక్కువ మంది వచ్చేవారు.

ఈ నేపథ్యంలో వినూత్నంగా ఏదో ఒకటి చేసి కస్టమర్లను ఆకర్షించాలని భావించాడు. అందుకే దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి 80 గ్రాముల బంగారు రేజర్‌ను తయారు చేయించాడు. బంగారు రేజర్‌తో గడ్డం గీయటానికి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. దీనిపై అవినాష్‌ మాట్లాడుతూ.. ‘‘ ఈ బంగారు రేజర్‌తో గడ్డం గీయటం ద్వారా సామాన్య ప్రజలు సైతం తాము ప్రత్యేకం అని అనుకునేలా చేస్తున్నాము. గడ్డం చేయించుకోవటానికి కేవలం 100 రూపాయలు మాత్రం చెల్లిస్తే చాలు’’ అని అన్నాడు.

చదవండి : గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే..

ఇంటర్వ్యూలలో ఫెయిల్‌.. బాధతో 9 ప్లాస్టిక్‌ సర్జరీలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top