న్యూస్‌రీల్
వైద్య కళాశాలకు మదన్‌మోహన్ పేరు బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం ఈ పథకంతో పేద కుటుంబాలకు భద్రత: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
రూ.54.67 కోట్లతో 14 విద్యుత్ సబ్ స్టేషన్లు రూ.14.35 కోట్లతో కొమురవెల్లి మల్లన్న వసతి సత్రం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభా ప్రాంగణంలో భూ బాధితుల ప్లకార్డుల కలకలం ప్రశాంతంగా ముగిసిన సీఎం రేవంత్ పర్యటన
శుక్రవారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2026
సిద్దిపేటజోన్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రజాపాలన పేరిట రాష్ట్ర సమగ్రాభివృద్ధితోపాటు ప్రజా సంక్షేమం దిశగా ముందుకు సాగుతున్న ఇందిరమ్మ రాజ్యం మళ్లీ 2029లో అధికారంలోకి రావడం ఖాయమని, ఆ దిశగా కాంగ్రెస్‌కు ఒకప్పుడు కంచుకోటగా నిలిచిన సిద్దిపేట గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం మాజీప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి, పట్టణ వీధుల్లో పాదయాత్ర ద్వారా సభస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సభావేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఆధ్వర్యంలో కొమురవెల్లి అర్చకులు సీఎం రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో మాట్లాడుతూ..మాజీ సీఎం కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది మాజీమంత్రి మదన్‌మోహన్ అన్నారు. సిద్దిపేటకు, కాంగ్రెస్ పార్టీకి మదన్‌మోహన్‌చేసిన సేవలకు గుర్తుగా సిద్దిపేట వైద్య కళాశాలకు ఆయన పేరును ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి 24గంటల్లోగా జీవో జారీ చేయాలని వైద్యశాఖ మంత్రిని ఆదేశించారు. సిద్దిపేట గడ్డలో 2029లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రజలు సహకరించాలని, ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు ఇందిరమ్మ రాజ్యంలో మంత్రి పదవి వచ్చేలా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ బాధ్యత తీసుకుంటారన్నారు. నవంబర్ 26న రాష్ట్ర వ్యాప్తంగా రెండోవిడత ఇందిరమ్మ చీరల పంపిణీలో భాగంగా కోటిమంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామన్నారు. అంతకుముందు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ...ఇందిరాగాంఽధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కుటుంబ జీవితబీమా పథకం అందించడం సంతోషకరమన్నారు. ఈ పథకం పేద కుటుంబాలకు ఎంతో భద్రత కల్పిస్తుందన్నారు. కాళేశ్వరం పేరిట గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మనందరిదని, ఆదరించాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
రూ.544.11 కోట్ల పనులకు శ్రీకారం
జెండా ఎగరేస్తాం.. ఇక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి పక్కా


