విద్యాధరి సేవలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యాధరి సేవలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధమైన వర్గల్‌ శ్రీవిద్యాధరి క్షేత్రాన్ని గురువారం ప్రభుత్వ చీఫ్‌ విప్‌ విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వారికి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు హర్షణీయం

మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని వివిధ దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో దళిత సంఘాల నాయకులు బక్కి వెంకటయ్యను గురువారం శాలువాతో ఘనంగా సన్మానంచి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన హైపవర్‌ కమిటీ సమావేశంలో ప్రతీ జిల్లాలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని బక్కి వెంకటయ్య ప్రతిపాదించారన్నారు. ప్రత్యేక కోర్టులతో కేసుల విచారణ వేగవంతమై బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మాల జిల్లా జేఏసీ చైర్మన్‌ ఆస లక్ష్మణ్‌, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, సీనియర్‌ జర్నలిస్టు బండ నర్సింహులు, నాయకులు ఆస బాబు, తౌడ శ్రీనివాస్‌, రాజయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

దుంపలపల్లి వాసికి

జాతీయ పురస్కారం

దుబ్బాకటౌన్‌: విద్య, ఆధ్యాత్మిక సేవ, సామాజిక సంక్షేమం, వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు చేసిన విశేష సేవలకుగాను విశ్రాంత ఉపాధ్యాయుడు ఏ.వి.బాలేశం ఢిల్లీలో జాతీయ పురస్కారం అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కమిషనర్‌ సుధారాణి రేలంగి, కరోల్‌ బాగ్‌ ఎమ్మెల్యే రవి, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. 1969 నుంచి ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి కృషి చేసిన ఆయన, 2006లో పదవీ విరమణ తర్వాత కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన టీటీడీ ధర్మప్రచార పరిషత్‌ కార్యకర్తగా, వయోవృద్ధుల సేవా సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

బీజేపీ నుంచి

రైనానాయక్‌ బహిష్కరణ

అక్కన్నపేట(హుస్నాబాద్‌): నాలుగైదు రోజులుగా సోషల్‌ మీడియా వేదికగా పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు చేస్తున్న బీజేపీ మండల కార్యదర్శి లావుడ్యి సురేశ్‌(రైనా నాయక్‌)ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ మండలాధ్యక్షుడు రామంచ మహేందర్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మహేందర్‌రెడ్డి తెలిపారు.

వడ్ల కుప్పలపై కోతులు

దుబ్బాకరూరల్‌: మండలంలోని గోసాన్‌పల్లిలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను ఆర బెట్టారు. దీంతో కోతుల గుంపులు వడ్ల కుప్పలపై ఆడుతూ చిందర వందర చేసేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement