‘ఇందిరమ్మ’కు ఆన్‌లైన్‌ చిక్కులు | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’కు ఆన్‌లైన్‌ చిక్కులు

Nov 20 2026 7:39 AM | Updated on Nov 20 2026 7:39 AM

కమిటీలు ఎంపిక చేసిన పేర్లు

అనర్హుల జాబితాలో ప్రత్యక్షం

మొబైల్‌ యాప్‌పై

అవగాహన లేని అధికారులు

ఆన్‌లైన్‌ సమస్యలకు పరిష్కారం

చూపేదెవరు..?

ఇంటి బిల్లులు రాక

లబ్ధిదారుల ఆందోళన

పూర్తి చేసి ఏడాదైనా బిల్లు రాలేదు

ఇల్లు ముగ్గు పోసినా సారు మొదటి బిల్లు రాలేదని అడిగితే పనులు చేయి మొత్తం బిల్లు ఒకేసారి వస్తదంటే సార్ల మాటలు నమ్మి రూ.10 లక్షల అప్పు తెచ్చి పని చేయించిన. ఏడాదైనా ఇప్పటికీ ఒక్క పైసా రాలే. నమ్మిన సార్లు నట్టేటా ముంచిండ్రు. బిల్లు అడిగితే ముఖం చాటేస్తున్నారు. మాకంటే పెద్ద ఇళ్లు కట్టినోళ్లకు బిల్లు ఇస్తిరి. మేమేం పాపం చేసినం.. మా పేదోళ్లను ముంచుడు మీకు న్యాయమేనా.?

–ఏలేంద్ర, తోటపల్లి

విచారణ చేపట్టాం

ఇందిరమ్మ రెండవ విడత మండలానికి 68 లబ్ధిదారుల జాబితా రావడంతో అధికారుల చేత గ్రామాల్లో విచారణ జరిపించినం. అందులో 18 మంది పేర్లు ఎల్‌–3 జాబితాలో ఉండటంతో సర్పంచ్‌ల విజ్ఞప్తుల మేరకు ఎల్‌–1లకు మార్చాలని జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించాం.

–సురేశ్‌, ఎంపీడీఓ, హుస్నాబాద్‌

పేదల సంక్షేమమే

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ప్రజాపాలనలో పేదల సొంతింటి కల తీరుతుందని, ఆశ పడ్డ పేదలకు ‘ఇందిరమ్మ’మొబైల్‌ యాప్‌ వారికి ఇందిరమ్మ ఇల్లు రానివ్వకుండా అడ్డుపడుతుంది. ఇల్లు కట్టి అప్పులపాలైనవారు కొందరైతే ఎలాంటి సొంతిల్లు, వాహనం లేకుండానే అనర్హుల (ఎల్‌–3) జాబితాలో నమోదై ఇందిరమ్మ ఇల్లుకు నోచుకోనివారు మరికొందరు. అయితే ఆన్‌లైన్‌ సమస్యలంటూ అధికారులు ఇంటి బిల్లుల మంజూరులో కొర్రీలు పెడుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యాలయం నుంచి జిల్లా హౌజింగ్‌ కార్యాలయం చుట్టూ రోజు తిరిగినా పరిష్కారం దొరకడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.

హుస్నాబాద్‌రూరల్‌

హుస్నాబాద్‌ మండలంలో 17 గ్రామాలుంటే 2025 జనవరిలో తోటపల్లి గ్రామాన్ని ఎంపిక చేసి 132 మందికి ఇళ్లు మంజూరు చేసిన అధికారులు ప్రోసీడింగ్స్‌ను అందించి ఇంటి నిర్మాణం కోసం ముగ్గులు పోశారు. ఇందులో 61 మంది పనులు మొదలు పెట్టగా ఇప్పటివరకు 23 మంది అష్టకష్టాలు పడి పూర్తి చేశారు. మొబైల్‌ యాప్‌ సాకుతో అధికారులు బిల్లులు ఇవ్వడం లేదని 71 మంది ఇళ్లను రద్దు చేసుకున్నారు. మండలంలో మిగతా 16 గ్రామాలకు 179 ఇళ్లు అధికారులు మంజూరు చేశారు. మొదటి విడత 240 ఇళ్లు మంజూరైతే 84 ఇళ్లు మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా 156 మంది బిల్లులు రావడం లేదని పనులు నిలిపి వేశారు. ఇటీవల మండలంలో రెండో విడత 68 మందికి ఇళ్ల మంజూరుకు గ్రామాల నుంచి ఇందిరమ్మ కమిటీలు ప్రతిపాదనలు పంపిస్తే అందులో 18 మంది పేర్లు ఎల్‌–3 (అనర్హుల)జాబితాలో ఉండటంతో విచారణ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

ఇందిరమ్మ మొబైల్‌యాప్‌ సాకులు

ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి సంక్షేమ పథకాల కోసం అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసిన అర్జీదారుల కోసం అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి మూడు కేటగిరీలుగా(ఎల్‌–1,2,3) ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఉమ్మడి కుటుంబాలు ఒకే ఇంట్లో ఉండటంతో అధికారులు ముగ్గురు కొడుకులు ఉన్న చోట కూడా అందరికీ ఆర్‌సీసీ ఇల్లున్నట్లు నమోదు చేశారు. అద్దెకు ఉండే వారిని సైతం సొంత ఇల్లుగానే నమోదు చేయడంతో సొంతిల్లు, వాహనం లేని పేద కుటుంబాలు కూడా ఎల్‌–3 (అనర్హుల) జాబితాలో చేర్చారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్‌ యాప్‌పై అధికారులకు అవగాహన లేకపోవడంతో పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లకు దూరమైతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లకు అవగాహన లేకపోవడంతో సమస్యలు తీరక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలు సడలించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

దుబ్బాకటౌన్‌: అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి కనకయ్య తెలిపారు. మంతూర్‌ గ్రామంలో నూతన పెన్షన్‌ లబ్ధిదారులకు గురువారం పెన్షన్‌ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, చేయూత పింఛన్ల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేస్తామని, పింఛన్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పర్వేజ్‌, ఉప సర్పంచ్‌ సంతోశ్‌, కార్యదర్శి మాశుం ఆలీ, నాయకులు పాల రామాగౌడ్‌, పట్నం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement