నర్సింగ్‌ ఫ్యాకల్టీలకు దరఖాస్తులు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ ఫ్యాకల్టీలకు దరఖాస్తులు ఆహ్వానం

Nov 7 2026 10:11 AM | Updated on Nov 7 2026 10:11 AM

నర్సింగ్‌ ఫ్యాకల్టీలకు దరఖాస్తులు ఆహ్వానం సామాజిక అభివృద్ధికే ఆత్మగౌరవ భవనాలు 19న సీఎం బహిరంగ సభ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

తొగుట(దుబ్బాక): స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పీజీసీఆర్టీ నర్సింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో నర్సయ్య శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 07 నుంచి 13వ తేదీలోగా విద్యార్హత ధృవపత్రాల ప్రతులు, రెజ్యూమ్‌తో కేజీబీవీ పాఠశాలలో నేరుగా అందజేయాలని కోరారు. దరఖా స్తులు చేసుకున్న అభ్యర్థులకు పాఠశాలలో డెమో నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్హులైన అభ్యర్దులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు.

హుస్నాబాద్‌: బీసీ కులాల ఆత్మ గౌరవం, ఐక్యత, సామాజిక అభివృద్ధికి ఆత్మగౌరవ భవనాలు ఎంతగానో తోడ్పాడుతాయని బీసీ ఐక్య వేదిక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 38 కులాల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్బంగా శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఐక్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ బీసీ చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా రూ.88.50 కోట్లు నిధులు మంజూరు కావడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం బీసీ కులాల అభ్యున్నతికి, ఆత్మ గౌరవానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో ఈ నెల 19న కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి హరికృష్ణ తెలిపారు. సభ నిర్వహణకు అనువైన ప్రదేశాలను సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో పరిశీలించారు. నాగదేవతగుడి సమీపంలో, పత్తి మార్కెట్‌వద్ద, రంగధాంపల్లి చౌరస్తా నుంచి పొన్నాల వెళ్లే మార్గంలోని పలు ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌తో చర్చించి సభా వేదికను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట డివిజన్‌ ఆత్మ కమిటీ చైర్మన్‌ పూజల గోపికృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొమ్మల యాదగిరి, కాలీముద్దీన్‌ అహ్మద్‌, దాస అంజన్న, మార్క సతీశ్‌, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షులు రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఎల్కతుర్తి మండల పరిధిలోని దామెర గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ ముదిరాజ్‌ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కష్టపడి పని చేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలన ప్రజలకు నచ్చడం లేదని రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు రాంగోపాల్‌ రెడ్డి, శ్రీకాంత్‌ యాదవ్‌, మాజీ సర్పంచ్‌ రవీందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement