నంగునూరు(సిద్దిపేట): ఉన్నత స్థానంలో ఉన్నవారిని మార్గదర్శకంగా తీసుకుని విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఇన్‌చార్జి డీఈఓ, జెడ్పీ సీఈఓ రమేశ్ పిలుపునిచ్చారు. నర్మేట ఉన్నత పాఠశాలలో శనివారం గ్రాడ్యూయేషన్ డే నిర్వహించారు. జిల్లాటాపర్‌గా నిలిచిన అమూల్యకు నగదు బహుమతిని అందజేసి, పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన 74 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. రూ.2.25 లక్షలతో దివ్యాంగుల కోసం సుచిర్ ఇండియా సౌజన్యంతో నిర్మించిన టాయిలెట్లను ఆ సంస్థ చైర్మన్ కిరణ్‌తో కలసి డీఈఓ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..ఎన్నో కష్టాలకు ఓర్చి చదివిస్తున్న తల్లిదండ్రులు, గురువులను గౌరవించి ఉన్నత స్థానంలో నిలిచేలా చక్కగా చదువు కోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి, సర్పంచ్ స్వాతి, భాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, బాబు, అజీత్, రాజిరెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ డీఈవో రమేశ్


