ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కోసం కేటాయించిన రూ.116 కోట్ల ఏమయ్యాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. వర్షాకాలం ముగిసినా మత్స్యసొసైటీలకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయలేదన్నారు. చేప పిల్లల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అర్హత కలిగిన సొసైటీల ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. సమావేశంలో నాయకులు కీసరి పాపయ్య, వెంకటేశం, యాట యాదగిరి, సంతోష్, దేవయ్య తదితరులున్నారు.
సిద్దిపేటఅర్బన్: ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ (గ్రేడ్–3) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలో లోపలికి అనుమతించారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 50 మందికి గాను 28 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్ బొడ్డు రఘు, టీజీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్, అబ్జర్వర్ జునైద్ అహ్మద్, ఫ్లయింగ్ స్క్వాడ్, డీఐఈఓ రవీందర్‌రెడ్డి, అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ ఉదయశ్రీ, టీసీఎస్ ఆఫీసర్ మహేశ్‌బాబు, సిస్టం అడ్మిన్ షాదుల్లా తదితరులు పర్యవేక్షించారు.
బెజ్జంకి(సిద్దిపేట): రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ ఫలాలు పొందేందుకు సమష్టిగా కృషి చేయాలని రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్‌గణేశ్ పిలుపునిచ్చారు. బెజ్జంకి మండల నూతన కార్యవర్గాన్ని శనివారం జిల్లా సంఘం అధ్యక్షుడు ఐలయ్య సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌గణేశ్ మాట్లాడుతూ...సంక్షేమ పథకాల అమలులో అర్హులకు అందేలా చూస్తామన్నారు. నవంబర్‌లో జరిగే రాష్ట్ర 4వ మహాసభలకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అధ్యక్షుడిగా వడ్లూరి సాయిలు, జిల్లా ఉపాద్యక్షునిగా నేరెల్ల రాజయ్య, యూత్ జిల్లా ఉపాధ్యక్షుడిగా దొంతి నాగరాజుతోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మార్కెటింగ్ శాఖలో నియామకాలు చేపట్టకుండానే ఏజెన్సీలు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో కోట్లల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. పార్టీ పట్టణ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో అత్తు ఇమామ్ మాట్లాడుతూ..ఐదేళ్లుగా ఏజెన్సీ ముసుగులో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమించకుండానే, ప్రతీ నెల రూ.2లక్షలు మార్కెటింగ్‌శాఖ నుంచి వసూళ్లు చేస్తున్నారన్నారు. ఆర్థిక మోసానికి పాల్పడిన వారిపై మార్కెటింగ్‌శాఖ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్యాదారి మధు, అర్షద్, హుస్సేన్, గయాజుద్దీన్, విజయ్, డానియల్, నజ్జు, బాబా తదితరులు పాల్గొన్నారు.


