సవరణలు స్వల్పమే | - | Sakshi
Sakshi News home page

సవరణలు స్వల్పమే

Oct 25 2026 9:32 AM | Updated on Oct 25 2026 9:32 AM

సిద్దిపేటజోన్‌: ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ(సర్‌)లో సవరణకు నామమాత్రంగా స్పందించారు. జూన్‌ 15 నుంచి అక్టోబర్‌ 07వరకు జిల్లావ్యాప్తంగా సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్‌, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో ఫార్మ్‌ 06, 06ఏ ,07, 08 ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఆయా కేటగిరీల్లో మొత్తంగా 13,673 దరఖాస్తులు రాగా వాటిలో 1,100 దరఖాస్తులను అప్‌డేట్‌ చేశారు. నవంబర్‌5 లోగా పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది.

కొత్తగా ఓటు కోసం 6,113

18 ఏళ్లు నిండి, ఇప్పటివరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కానీ వారికి ఫార్మ్‌ 06ద్వారా కొత్తగా ఓటర్లుగా అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా 6,113దరఖాస్తులు ఫార్మ్‌06 ద్వారా వచ్చాయి. వీటిలో అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 2,035 రాగా అత్యల్పంగా దుబ్బాక నియోజకవర్గంలో 865 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా హుస్నాబాద్‌ లో 1521, గజ్వేల్‌లో 1,692 దరఖాస్తులు వచ్చాయి.

విదేశీ ఓటర్ల నమోదు అంతంతే

వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస ఓటర్ల నమోదు అంతంతే..జిల్లా వ్యాప్తంగా 06 ఫార్మ్‌ ద్వారా కేవలం 24 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 18 రాగా దుబ్బాకలో 01, గజ్వేల్‌లో 05 వచ్చాయి. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు.

తొలగింపు కోసం 501

ఓటర్‌ జాబితాలో పేరు తొలగించాలని జిల్లావ్యాప్తంగా 501 దరఖాస్తులు వచ్చాయి. చనిపోయిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస, అనర్హులైన ఓటర్ల తొలగింపు కోసం ఫార్మ్‌ 07ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కేటగిరీలో అత్యధికంగా గజ్వేల్‌లో 183 దరఖాస్తులు రాగా అత్యల్పంగా సిద్దిపేటలో 77 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా దుబ్బాకలో 159, హుస్నాబాద్‌లో 82 దరఖాస్తులు రాగా వీటిలో మొత్తంగా 464 దరఖాస్తులను అప్‌డేట్‌ చేశారు.

సవరణలకు 7,035..

ఓటరు జాబితాలో మార్పులు, సవరణల కోసం నాలుగు నియోజకవర్గాల్లో 7,035 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 635 దరఖాస్తులను అప్‌ డేట్‌ చేశారు. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 2,343, అత్యల్పంగా దుబ్బాకలో 1,268 దరఖాస్తులు రాగా గజ్వేల్‌లో 2,080, హుస్నాబాద్‌లో 1,344 దరఖాస్తులు వచ్చాయి.

జిల్లాలో ఫార్మ్‌ 08 నామమాత్రంగా స్పందన

7,035 సవరణ దరఖాస్తులు

అదేతీరుగా విదేశీ ఓటర్ల దరఖాస్తులు

కొత్తగా నమోదైన దరఖాస్తులు 6,113

నియోజకవర్గం ఫార్మ్‌ 06 06ఏ 07 08

సిద్దిపేట 2,035 18 77 2,343

దుబ్బాక 865 01 159 1,268

గజ్వేల్‌ 1,692 05 183 2,080

హుస్నాబాద్‌ 1,521 00 82 1,344

మొత్తం 6,113 24 501 7,035

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement