చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రశాంత్‌రెడ్డి

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

చేర్యాల(సిద్దిపేట): వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్‌ చైర్మన్‌గా బోయిని శ్రీనివాస్‌, డైరెక్టర్లుగా జంబుల వెంకట్‌రెడ్డి, పచ్చిమడ్ల వెంకటయ్య, గొల్లపల్లి శ్రీనివాస్‌, ఆరె వెంకటనారాయణ, సందిటి లక్ష్మి, లకావత్‌ యాదగిరి, ఇరుగు ప్రకాశ్‌, గార్లపాటి మహిపాల్‌రెడ్డి, కన్నెబోయిన రామకృష్ణ, పింగిలి ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల కృష్ణ నియామకమయ్యారు. నలుగురు ఎక్స్‌ అఫిషియో మెంబర్లుగా పీఏసీఎస్‌ చైర్మన్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఏడీఏ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌లను నియమిస్తూ జీఓ జారీ చేశారు.

కార్మికుల ఐక్యతతోనే

సమస్యల పరిష్కారం

డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి

గజ్వేల్‌: ఆర్‌టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ ఆర్‌టీసీ డిపోలో టీఎంయూ (తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌) కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆర్‌టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. టీఎంయూ గౌరవాధ్యక్షులిగా తన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తానన్నారు. కార్యక్రమంలో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నర్సింహు లు, పీరయ్య, జిల్లా చైర్మన్‌ నారాయణ, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ ఆర్‌టీసీ డిపో సెక్రటరీ నర్సింహులు, అధ్యక్షుడు ఆర్‌సీరెడ్డి పాల్గొన్నారు.

మెరుగైన సేవలే లక్ష్యం

నూతన మున్సిపల్‌ కమిషనర్‌ అభిలాష్‌

చేర్యాల(సిద్దిపేట): మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా అభిలాష్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని కమిషనర్‌ చాంబర్‌లో బాధ్యతలు చేపట్టి మాట్లాడారు. పట్టణ ప్రజ లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపా లు, రహదారులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వ్యక్తిగత ఆరోగ్యానికి

ప్రాధాన్యత ఇవ్వాలి

మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌

సిద్దిపేటజోన్‌: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ సూచించారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, డెంటల్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించా రు. అనంతరం పలువురు కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో వైద్యులు నవీన్‌, వైష్ణవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అసమానతలు లేని

సమాజానికి కృషి

వర్గల్‌(గజ్వేల్‌): అసమానతలు లేని సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని జిల్లా ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి మంద కుమార్‌ మాదిగ అన్నారు. గురువారం తున్కిఖాల్సాలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ మండల కమిటీల ఎన్నిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి హక్కులు, ఆత్మగౌరవం కోసం శ్రమిస్తున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ బలోపేతానికి అందరం శ్రమించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement