విద్యార్థుల ఆరోగ్యమే దేశభవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యమే దేశభవిష్యత్‌

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

● మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి ● సర్కారు బడుల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ ప్రారంభం ● జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు మధ్యాహ్నభోజనం

● మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి ● సర్కారు బడుల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ ప్రారంభం ● జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు మధ్యాహ్నభోజనం

హుస్నాబాద్‌: విద్యార్థుల ఆరోగ్యమే దేశభవిష్యత్‌ అని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి అన్నారు. సర్కార్‌ బడులు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉదయం ఆకలి తీర్చేందుకు ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో నే మొదటి సారిగా హుస్నాబాద్‌, కోహెడ మండలాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో అల్పాహారం పథకం అమలులోకి వచ్చింది. అక్కన్నపేట మండలంలో మరో రెండు రోజుల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుండ గా, కొత్తగా బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి శ్రీకారం చుట్టారు.

నాణ్యమైన టిఫిన్‌...

హరేరామ్‌ హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో కరీంనగర్‌లోని కిచెన్‌ నుంచి ప్రత్యేక వాహనాల్లో స్కూల్‌, కళాశాలల విద్యార్థుల కు బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం సరఫరా చేశా రు. ఉదయం 8.45 గంటలకు సోమవారం ఇడ్లీ (రెండు), చట్నీ లేదా సాంబర్‌, మంగళవారం పూరి, ఆలు కుర్మా, బుధవారం దోశ, చట్నీ, గురువారం ఉప్మా, చట్నీ, శుక్రవారం రాగి ఇడ్లీ, సాంబ ర్‌, శనివారం బొండా, చట్నీ అందజేస్తారు. రోజు తప్పించి రోజు పాలు కూడా అందించనున్నారు.

కళాశాల మెనూ...

బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌ రెడ్డి ప్రారంభించారు. హుస్నాబాద్‌లోని బాలికల జూనియర్‌ కళాశాలలో 235 మంది, బాలుర జూనియర్‌ కళాశాలలో 370 మంది, కోహెడ జూనియర్‌ కళాశాలలో 320 మంది విద్యార్థులకు మొదటి సారి మధ్యాహ్న భోజనం వడ్డించారు. కళాశాలలో రోజు వారీ మెనూ ప్రకారం ప్రతి సోమవారం కిచిడి, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, మంగళవారం రైస్‌, సాంబర్‌, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, బుధవారం రైస్‌, గ్రీన్‌ లీఫ్‌ వెజిటెబుల్‌ పప్పు, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, గురువారం వెజిటెబుల్‌ బిర్యానీ, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, శుక్రవారం రైస్‌, సాంబర్‌, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ, శనివారం రైస్‌, గ్రీన్‌ లీఫ్‌ వెజిటెబుల్‌ పప్పు, మిక్స్‌డ్‌ వెజిటెబుల్‌ కర్రీ అందజేస్తారు. ఈ కాార్యక్రమాల్లో మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, కేడం లింగమూర్తి, మాజీ ఎంపీపీ వెంకట్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ, కళాశాలల ప్రిన్సిపాల్స్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement