మరో ఉద్యమానికి సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దపేట): ఉపాధ్యాయులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూడేళ్లుగా రావాల్సిన పీఆర్సీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇంతవరకు డీఏలు విడుదల చేయకపోవడం, సీపీఎస్‌ను రద్దు చేయకపోవడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధమై మన హక్కుల్ని మన పోరాటాల ద్వారా సాధించుకుందామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాం అందించకపోవడం ద్వారా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉందని ప్రధానోపాధ్యాయులను బాధ్యులుగా చేయడం సరైనది కాదన్నారు. అనంతరం సిద్దిపేట అర్బన్‌ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, రాములు, అజీజ్‌, తిరుపతి పాల్గొన్నారు .

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

చిన్నకోడూరు(సిద్దిపేట): ఉపాధ్యాయులకు తీవ్రంగా నష్టం చేసే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ విధానాన్ని పునరుద్ధరించాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం చంద్లాపూర్‌, రామంచ, పెద్దకోడూరు, చిన్నకోడూరు ఉన్నత పాఠశాలల్లో సమస్యల సేకరణ, టీపీటీఎఫ్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement