పారదర్శకంగా భూముల రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూముల రీ సర్వే

Oct 2 2026 7:32 AM | Updated on Oct 2 2026 7:32 AM

● కలెక్టర్‌ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం

● కలెక్టర్‌ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి రీ–సర్వే ప్రక్రియ ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని జుమ్లాతండాలో కొనసాగుతున్న రీ–సర్వేను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకే ఈ ప్రక్రియ చేపడుతున్నామన్నారు. సుమారు 90 ఏళ్ల క్రితం నాటి భూ సర్వే రికార్డుల వల్ల పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం అనేక భూవివాదాలు తలెత్తుతున్నాయన్నారు. భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు హద్దులు, పట్టా వివరాలను సంబంధిత రికార్డులతో పక్కాగా సరిపోల్చి నవీకరించాలని ఆదేశించారు. ముందుగా గ్రామ సరిహద్దులను నిర్దేశించి, మొదటి విడతగా ప్రభుత్వ స్థలాలలో ఆ తర్వాతే పట్టా, ఆసైన్డ్‌ భూములలో సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎస్‌ నవీన్‌కుమార్‌, ఆర్‌ఐ, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement